పంచాయతీ రాజ్ సంస్థల్లో కారుణ్య నియామకాలపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 24,2024: పంచాయతీ రాజ్ సంస్థల్లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 24,2024: పంచాయతీ రాజ్ సంస్థల్లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరణించిన సందర్భంలో వారి వారసులకు కారుణ్య నియామకాలు అందించే విధానంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
తన కార్యాలయానికి కారుణ్య నియామకాలపై పలు అర్జీలు వచ్చిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి ఈ అంశంపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, అలాగే నిబంధనలు పై అధికారుల నుండి వివరాలు సేకరించారు.

అధికారులు పేర్కొన్న ప్రకారం, పంచాయతీ రాజ్ పరిధిలో పనిచేసే మరణించిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అయితే ఖాళీలు తక్కువగా ఉండటంతో ఈ నియామకాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా, పంచాయతీ రాజ్ సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం వేచి చూస్తున్న వారిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కామన్ పూల్ ఖాళీలలో నియమించే అవకాశంపై చర్చించారు. ఈ నియామకాలు వేగవంతం చేయడానికి సాధారణ పరిపాలన శాఖతో చర్చించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.