చంద్రబాబు ఆడుతున్నమైండ్ గేమ్.. జగన్ కు తెలియడం లేదా..??!!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ దృశ్యాన్ని పరిశీలిస్తే, మాజీ ముఖ్యమంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,2024: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ దృశ్యాన్ని పరిశీలిస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న పరిస్థుతులపై ఎంతగా అవగాహన కలిగి ఉన్నారు.. ? అన్న సందేహం వస్తోంది. టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పన్నుతున్న వ్యూహాలు, తన మిత్రులని ఎంత స్మార్ట్‌గా ఉపయోగిస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

వైసీపీ నుండి పది మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్టు సమాచారం వస్తోంది, ఇప్పటికే ఇద్దరు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎంపీలతో జరుగుతున్న రాజకీయ మార్పులు, మండలిలో టీడీపీ కంట్రోల్ పెరిగినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ బలోపేతానికి పనులు జరుగుతున్నాయి, వైసీపీని వీడేందుకు మరికొందరు సిద్ధమవుతున్నారు.

కేతిరెడ్డి కూడా రావడానికి ముందుకు వస్తున్నారని, నెల్లూరు వైసీపీకి సర్వం ఖాళీ అయిపోయిందని అర్థమవుతోంది. ఒంగోలు కూడా ఖాళీగా మారింది. టీడీపీకి గేట్లు మూసినప్పటికీ, జనసేనకు గేట్లు తెరుచుకున్నాయి.

మరోవైపు, పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో జోక్యం తక్కువగా ఉండి, పార్టీ బలోపేతంపై మాత్రమే దృష్టి పెట్టడం విశేషం. తిరుపతి లడ్డూ వివాదంలో చంద్రబాబు చాలా చక్కగా దెబ్బ కొట్టారు, మత రాజకీయం మొదటిసారిగా ప్రదర్శించారు. వైసీపీ మాటలు పడిపోయాయంటే, రిపోర్టు వెలువడిన తర్వాత స్పష్టంగా తెలుస్తోంది.

తిరుమల లడ్డూ విషయంలో వైవీ సుబ్బారెడ్డి రెచ్చిపోయిన నేపథ్యంలో విజిలెన్స్ నోటిస్ వెలువడటం, వైసీపీని భూస్థాపితం చేసే పరిస్థితికనిపిస్తోందని, తిరుమల భక్తులు, హిందువులు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఇక వైసీపీ మూతపడినట్లేనని చెబుతున్నారు అనలిస్టులు.

సోషల్ మీడియాలో వైసీపీ సైలెంట్ అయిపోవడం, వైవీ, భూమన ఇద్దరూ బయటకు రావడం ఆశ్చర్యం కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. టీటీడీ రిపోర్టు సాక్ష్యాలతో సహా వెలువడటంతో, జగన్ ప్రస్తుతం కష్టమైన పరిస్థితిలో ఉన్నాడని వారు వెల్లడిస్తున్నారు.

రాజ్యసభలో బలం ఉన్నా, బీజేపితో కలవడం సాధ్యం కాకపోవడం, చంద్రబాబుకు దగ్గరగా మారడం మరో కీలక అంశం. నందిగం సురేష్ ఇన్ని రోజులు బయటకు రాలేదు, వచ్చినా యాక్టివ్ గా ఉండలేనన్న సందేహం కొనసాగుతోంది.

చంద్రబాబుని విమర్శించే ఛాన్స్ జగన్ కు లేదు, లోకేష్ జోక్యం ప్రభుత్వంలో కనిపించడం లేదు. పొత్తులో ఉన్న పార్టీలు చంద్రబాబు మాటలను మాత్రమే వినడం, బీజేపీలో జగన్ గ్యాంగ్ ని తొక్కేయడం రాజకీయ దృశ్యాన్ని మార్చివేసిందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ నుంచి బీజేపీకి ఎవరినీ వెళ్లనీయకుండా పర్యవేక్షించడం, పురందరేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం మంచి వ్యూహంగా భావిస్తున్నారు. రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే, జగన్ రాజకీయ భవిష్యత్తు అసాధారణంగా క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు కొందరు రాజకీయ పండితులు.

About Author