డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు ఖరారు సముచిత నిర్ణయం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 10,2024: ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 10,2024: ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషదాయకం. డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు ప్రతిపాదించగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
వారి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ , వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త పేరును ఖరారు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సత్యకుమార్ యాదవ్ కి, ఆ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు.

క్యాన్సర్, ఫైలేరియా, క్షయ వ్యాధుల నివారణకు సంబంధించిన ఔషధాలను కనుగొనడం, తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ఆవిష్కరణలతో ఖ్యాతి పొందిన డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరును ప్రభుత్వ వైద్య కళాశాలకు నిర్ణయించడం ద్వారా – ఆయన ప్రపంచానికి చేసిన సేవలను, మేలునీ మా కూటమి ప్రభుత్వం చిరస్మరణీయం చేసింది. వర్తమాన, భావి తరాలు ఆయన చేసిన పరిశోధనలు, ఆవిష్కరణల నుంచి స్ఫూర్తి పొందుతాయి.