ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సిసిబి సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 14, 2025: ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సిసిబి) తమ సమగ్ర కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 14, 2025: ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సిసిబి) తమ సమగ్ర కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సిఎస్ఆర్) ప్రాజెక్ట్ షైన్‌ (SHINE) కింద ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది.

నీటి ఏటిఎంలు, రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ) ఫిల్టర్‌లు, కొత్త పారిశుధ్య సదుపాయాలు,వాష్ (నీటి లభ్యత, పారిశుధ్యం, పరిశుభ్రత) కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్,సత్యసాయి జిల్లా తాడిమర్రి బ్లాక్‌లోని శివంపల్లిలో ప్రారంభించారు.

హెచ్‌సిసిబి సిఎస్ఆర్ ప్రాజెక్ట్‌ షైన్‌లో భాగంగా, తాడిమర్రి బ్లాక్‌లోని శివంపల్లిలో గ్రామస్తులకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు వాటర్ ఏటిఎం ఏర్పాటు చేయనుంది.

అదనంగా, ధర్మవరంలోని దుర్గానగర్ ప్రభుత్వ SW బాలికల హాస్టల్, ముదిగుబ్బ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, తాడిమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో మూడు ఆర్ఓ ఫిల్టర్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత అభివృద్ధిపై హెచ్‌సిసిబి కట్టుబాటును ప్రతిబింబిస్తున్నాయి.

ఇకపోతే, వాష్ కార్యక్రమంలో భాగంగా హెచ్‌సిసిబి ఆరు ప్రదేశాల్లో పారిశుధ్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.

Read this also..Andhra Pradesh Minister Inaugurates HCCB’s CSR Initiatives in Sri Sathya Sai & Anantapur Districts

Read this also..Canon India Introduces Free Camera Colour Matching Application for Seamless Multi-Camera Video Production

అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ బ్లాక్‌లో గుంజెపల్లె జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, గుట్టకిందపల్లి ప్రభుత్వ BC కళాశాల బాలుర హాస్టల్, గొట్లూరు జెడ్‌పి హైస్కూల్, ముదిగుబ్బ మండల ప్రభుత్వ BC బాలికల హాస్టల్, మాల్యవంతం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు.

పాఠశాలలు, కమ్యూనిటీల్లో పరిశుభ్రత, చేతుల కడుక్కోవడం, పారిశుద్ధ్య సాధనాల వినియోగంపై అవగాహన కల్పించే వాష్ సెషన్‌లు కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “గ్రామీణ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకరిస్తున్న తీరును చూస్తే ఆనందంగా ఉంది. హెచ్‌సిసిబి చేపడుతున్న నీటి సరఫరా, పారిశుధ్య అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి దార్శనికతకు తోడ్పాటునిస్తాయి” అని తెలిపారు.

హెచ్‌సిసిబి చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ అధికారి హిమాన్షు ప్రియదర్శి మాట్లాడుతూ, “మా లక్ష్యం సమాజంలో అర్థవంతమైన మార్పును తీసుకురావడం. మౌలిక సదుపాయాల మెరుగుదల, శుద్ధమైన నీటి అందుబాటు, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత ప్రోత్సాహం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర అభివృద్ధికి తోడ్పడతాం” అన్నారు.

Read this also.. Kiss Day 2025: Five Benefits of Kissing..

ఇది కూడా చదవండి..కిస్ డే 2025: ముద్దు పెట్టుకోవడం వల్ల ఎనిమిది ప్రయోజనాలివే..

హెచ్‌సిసిబి సిఎస్ఆర్ ప్రాజెక్ట్‌ షైన్‌ పర్యావరణ పరిరక్షణ, వాష్ కార్యక్రమాలు, మహిళా సాధికారత, విద్యా నైపుణ్యాల అభివృద్ధి, గ్రామీణ సమాజాల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఇప్పటి వరకు 2 లక్షల మంది ప్రజలు లబ్ధిపొందారు. 4,000 మందికి పైగా మహిళలకు డిజిటల్ & ఆర్థిక అక్షరాస్యత శిక్షణ ఇచ్చారు. నీటి ఏటిఎంలు, డిజిటల్ స్మార్ట్ బోర్డులు, సోలార్ వీధి దీపాలు వంటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు.

హెచ్‌సిసిబి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)తో కలిసి 5,000 మంది యువతకు మార్కెటింగ్ & అమ్మకాల శిక్షణను అందిస్తోంది. ఇప్పటివరకు 7,650 మందికి పైగా యువత శిక్షణ పొందారు. విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి.

About Author