కుంభకోణం శ్రీ ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 13,2025: తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం కుంభకోణంలో గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ శ్రీ ఆది

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 13,2025: తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం కుంభకోణంలో గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ శ్రీ ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ ఆదివినాయగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్, అనంతరం శ్రీ ఆదికుంభేశ్వరుని దర్శించుకుని విశేష అర్చనలు చేపట్టారు.
Read this also.. Airtel Payments Bank Becomes the First Payments Bank to Integrate I4C’s Real-Time API for Enhanced Customer Security
అర్చకులు స్వామివారి విశిష్టతను వివరిస్తూ, అమృత భాండం ఆకారంలో ఉన్న శివలింగాన్ని పవన్ కళ్యాణ్ కి ప్రాముఖ్యతను వివరించారు. ఇసుక, అమృతంతో ఆవిర్భవించిన ఈ లింగానికి అభిషేకం చేయరాదని, ప్రత్యేక పూజలు మాత్రమే నిర్వహించాలనే ఆచారం ఉందని అర్చకులు తెలియజేశారు. అనంతరం స్వామి వారికి పంచ హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి పాల్గొన్నారు.

మంత్రపీఠేశ్వరి అమ్మవారి దర్శనం
శ్రీ కుంభేశ్వర స్వామి ఆలయంలో ఎడమవైపు వెలసిన శ్రీ మంగళనాయకి అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అమ్మవారిని మంత్రపీఠేశ్వరి అమ్మవారిగా కొలుస్తారు. 72 కోట్ల మంత్రశక్తి నిక్షిప్తమైన ఈ శక్తిపీఠం విశిష్టతను అర్చకులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. పవన్ కళ్యాణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
అగస్త్య మహర్షి ధ్యాన పీఠ సందర్శన
ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ధ్యాన మందిరాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ ధ్యాన మండపంలో కూర్చుంటే తెలియకుండానే ధ్యాన స్థితికి చేరుకుంటారని అర్చకులు వివరించారు. ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ ప్రదేశంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ధ్యానం చేశారు.
ఇది కూడా చదవండి..స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
ఇది కూడా చదవండి.. తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని దర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆలయ అధికారులు ఘనస్వాగతం
ఆలయ అధికారుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కి సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆస్థాన ఏనుగుకు అరటి పళ్లు అందజేసి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆలయ ఈవో మురుగన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాల సుబ్రహ్మణ్యం, శంకర రాణి, చిదంబరం తదితరులు పవన్ కళ్యాణ్ గారికి స్వామి, అమ్మవారి చిత్రపటాలను అందజేసి సత్కరించారు.
“ఇప్పటికి స్వామివారి అనుగ్రహం లభించింది” – పవన్ కళ్యాణ్

శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని, స్వామిమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని నాలుగు సంవత్సరాలుగా వేచి చూస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడే మురుగన్ అనుగ్రహం లభించిందని, ఆహ్లాదంగా ఉందని వెల్లడించారు.
Read this also..Quality Power Electrical Equipments Limited to Launch IPO on February 14, 2025
Read this also..JSW Group Recognized as “Investor of the Decade” at Invest Karnataka 2025
పవన్ కళ్యాణ్ కుంభకోణం, స్వామిమలై పర్యటనలో భాగంగా తమిళనాడు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పూలమాలలు, శాలువాలతో సత్కరించి, బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో పవన్ కళ్యాణ్ స్వయంగా సెల్ఫీలు తీసుకుని వారిని ఉత్సాహపరిచారు.