హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 8 లక్షల CSR నిధులతో మెరుగైన మౌలిక సదుపాయాలు ప్రారంభం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 9, 2024: సరైన అభ్యాస వాతావరణాన్ని అందించే పాఠశాల మౌలిక సదుపాయాలు నిర్మించడం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 9, 2024: సరైన అభ్యాస వాతావరణాన్ని అందించే పాఠశాల మౌలిక సదుపాయాలు నిర్మించడం ఎంతో కీలకమని సర్జికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మెల్చియస్ మంగళం ఆంథోనీ అన్నారు.

ఆయన, తన సహోద్యోగులు రేణుక, స్వాతి, రామలక్ష్మి, కిరణ్, శ్యామ్ తో పాటు, Ms. శైలా తాళ్లూరి (NRI, ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) NGO వ్యవస్థాపకురాలు), S. కృష్ణారెడ్డి (హెడ్ మాస్టర్, MPPS అత్తాపూర్) కలిసి, అత్తాపూర్‌లోని హరిజనవాడలో ఉన్న ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.

ఈ పాఠశాల భవనం ముందు చాలా బడంగా ఉండేది. సరైన సౌకర్యాలు లేవు. పాఠశాలలో 1వ నుండి 5వ తరగతి వరకు 70 మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు, వీరిలో ఎక్కువ మంది వలస కార్మికుల పిల్లలు.

సర్జికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ CSR చొరవ కింద ఈ పాఠశాల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్యూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ముందుకు వచ్చింది. సంస్థ ఈ పాఠశాలను దత్తత తీసుకుని, 8 లక్షల రూపాయల నిధులతో పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించడం, విద్యుత్ పరికరాలు అమర్చడం, ఫ్లోరింగ్ పునర్నిర్మాణం, తలుపులు అమర్చడం, కొత్త నీటి ట్యాంకర్ ఏర్పాటు చేయడం, పాఠశాల భవనానికి రంగులు వేయడం వంటి పనులు చేయించింది.

ప్రభుత్వ పాఠశాల భవనాలు పునర్నిర్మాణం అవసరం. అవి విద్యా నాణ్యత, అభ్యాస వాతావరణం, ఉపాధ్యాయుల నైతికతను ప్రభావితం చేయగలవు. అలాగే, విద్యార్థుల భద్రత ,శ్రేయస్సు కూడా దృష్టిలో ఉంచుకుంటూ, ప్యూర్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని శైలా తాళ్లూరి తెలిపారు.

ఈ సందర్బంగా, స్కూల్ హెడ్ మాస్టర్ S. కృష్ణారెడ్డి, పాఠశాలకు మరిన్ని సౌకర్యాల అవసరం ఉందని, రెండు కొత్త తరగతి గదులు, సిబ్బందికి టాయిలెట్ సౌకర్యం, లైబ్రరీ అవసరమని చెప్పారు.

మెల్చియస్ మంగళం ఆంథోనీ,శైలా తాళ్లూరి, పాఠశాలకి మరింత సహాయం అందించేందుకు తమ వాగ్దానాన్ని వెల్లడించారు.

About Author