తిరుమల లడ్డూ కల్తీ: దుర్మార్గమైన చర్య అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 22,2024:తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్టు నిర్థారణ కావడం దుర్మార్గమైన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 22,2024:తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్టు నిర్థారణ కావడం దుర్మార్గమైన చర్య అని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు.
తిరుమల లడ్డూ నెయ్యి తయారీలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె వంటి ఇతర నూనెలు కలపడం జరిగిందని, ఎన్ఏడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఆధారంగా నిర్ధారించబడిందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కల్తీ లడ్డూలను రామ జన్మభూమికి పంపడాన్ని, పవిత్రతను అపవిత్రం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమలలో హిందువుల పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ ఘటనపై ప్రతి హిందువు పోరాడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.
వైసీపీ ప్రభుత్వం తిరుమల పూజా విధానాల్లో సంస్కరణలు తీసుకువచ్చి, ప్రసాదాల నాణ్యతను తగ్గించిందని ఆరోపించిన పవన్ కళ్యాణ్, తిరుమల ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.