బంజారాహిల్స్‌లో సఫారీ కిడ్ ప్రీ స్కూల్ రెండో కేంద్రం ప్రారంభం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 22, 2024: చిన్నపిల్లల విద్యా రంగంలో అంతర్జాతీయ బ్రాండ్‌గా నిలిచిన సఫారీ కిడ్ ప్రీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 22, 2024: చిన్నపిల్లల విద్యా రంగంలో అంతర్జాతీయ బ్రాండ్‌గా నిలిచిన సఫారీ కిడ్ ప్రీ స్కూల్ & డే కేర్ హైదరాబాద్‌లో తన రెండో కేంద్రాన్ని బంజారాహిల్స్‌లో ప్రారంభించింది.

ఈ విస్తరణ భారతదేశంలో ప్రపంచ స్థాయి చిన్నపిల్లల విద్యను అందించాలన్న సఫారీ కిడ్ మిషన్‌లో ఒక ముఖ్యమైన అడుగు. 2005లో సిలికాన్ వ్యాలీలో స్థాపించబడిన సఫారీ కిడ్, ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో 50కి పైగా కేంద్రాలను కలిగి ఉంది. వీటిలో అమెరికా, కెనడా, భారత్‌లోనూ విస్తరించి ఉంది.

బంజారాహిల్స్‌లో సఫారీ కిడ్ రెండో కేంద్రాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. నగరంలోని పిల్లల మెదళ్లను తీర్చిదిద్దడంలో నాణ్యమైన ప్రాథమిక విద్యకున్న ప్రాధాన్యం పట్ల ఒవైసీ చూపిన మద్దతు ఈ కార్యక్రమంలో ప్రతిబింబించింది. ఆయన నగరవాసిగా పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు అందించడంలో తన నిబద్ధతను ఈ సందర్బంగా హైలైట్ చేశారు.

ఈ కార్యక్రమంలో సఫారీ కిడ్ ఇండియా ఛైర్మన్ జితేంద్ర కర్సన్ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో మా రెండో కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా మా ఉనికిని మరింత బలోపేతం చేయడం సంతోషకరం. ఈ విస్తరణతో మరిన్ని కుటుంబాలకు ప్రపంచ స్థాయి ప్రాథమిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలని మా సంకల్పం.

వినూత్నమైన, సమగ్ర విద్యా విధానాలను అందించేందుకు తల్లిదండ్రుల నుండి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మా అభివృద్ధి వ్యూహంలో కీలకంగా మారింది. బంజారాహిల్స్ కేంద్రం ద్వారా సమాజంలో మేము మరింత ఇమిడిపోవడమే కాకుండా, పిల్లల విజ్ఞాన వృద్ధికి మరింత సమగ్ర అనుభవాన్ని అందిస్తున్నాము” అని అన్నారు.

సఫారీ కిడ్ విద్యా విధానం మాంటిస్సోరి, రెగియో ఎమిలియా, వాల్డర్ఫ్ విద్యా తత్వాల కఠిన విధానాలను సమగ్ర వ్యక్తిత్వ వికాసంతో మిళితం చేస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థిలోని ప్రత్యేక సామర్థ్యాలను వికసించేందుకు ఈ విధానం తోడ్పడుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఆనమ్ మీర్జా, హనా రెహ్మాన్ బేగ్, నౌషాబా ఫారూఖి, ఇరాన్ కాన్సులేట్ జనరల్ మోసిన్ మొఘదామి, శ్రీకృష్ణ సిల్క్స్ సీఈఓ వేణు రాచకొండ, ఐవైసీ తెలంగాణ ఉపాధ్యక్షుడు, టీపీసీసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఛైర్మన్ అమీర్ జావేద్ పాల్గొన్నారు.

ఇక, ఈ విద్యా సంవత్సరంలో సఫారీ కిడ్ ఇండియా మరో 8 కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

About Author