రేపటి నుంచి శ్రీ వేదాంత దేశికర్ సాల‌క‌ట్ల ఉత్స‌వం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, అక్టోబర్13,2023 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, అక్టోబర్13,2023 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ వేదాంత దేశికర్‌ ఆలయంలో అక్టోబ‌రు 14 నుంచి 23వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీ వేదాంతదేశికర్‌. వీరి జ‌యంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ఉత్స‌వాల చివ‌రి రోజైన అక్టోబ‌రు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద రాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్‌ ఆలయానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ వేదాంత దేశికర్‌ వారికి సమర్పిస్తారు. ఈ ఉత్స‌వం కార‌ణంగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఊంజ‌ల్ సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

శ్రీవేంకటేశ్వరస్వామివారు జన్మించిన భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంలోనే శ్రీవేదాంత దేశికర్‌ సుమారు 750 సంవత్సరాల క్రితం కాంచీపురంలోని తూప్పుల్‌ అగ్రహారంలో పుట్టారు.

ఈయన స్వామివారిని కీర్తిస్తూ దయా శతకం అనే స్తోత్రం రాశారు. శ్రీవారి సుప్రభాతం రచించిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్‌కు శ్రీ వేదాంత దేశికర్‌ గురువర్యులు.

About Author