శ్రీకాకుళంలో వైసిపి రైతు ర్యాలీ: టీడీపీపై సీదిరి తీవ్ర విమర్శలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా శ్రీకాకుళంలో రైతు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా శ్రీకాకుళంలో రైతు సమస్యలపై ర్యాలీ నిర్వహించింది. జిల్లా వైసిపి శ్రేణులు జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి శ్రీకాకుళం కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం వైసిపి నాయకులు జాయింట్ కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైసిపి అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, రెడ్డి శాంతిలతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ..
విజయవాడలో రెండు రోజులు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు, రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. బడ్జెట్‌లో రూ. 6.4 లక్షల అప్పు ఉందని చెప్పిన చంద్రబాబు, కలెక్టర్ల సమావేశంలో రూ. 10 లక్షల అప్పు ఉందని అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అప్పటి వరకు వైసిపి పార్టీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.

బైట్స్:
- ధర్మాన కృష్ణదాస్ – మాజీ డిప్యూటీ సిఎం, జిల్లా వైసిపి అధ్యక్షులు
- సీదిరి అప్పలరాజు – మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ