భారతదేశంలో 1.9 మిలియన్ వీడియోలను తొలగించిన యూట్యూబ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 3,2023: వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశంలో కమ్యూనిటీ నిబంధనలను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 3,2023: వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశంలో కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 1.9 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది.

ఇప్పటివరకు మరే దేశంలోనూ ఇంతపెద్ద సంఖ్యలో వీడియోలు తొలగించలేదు. ఈ సమాచారం యూట్యూబ్‌లోని ఒక నివేదికలో అందించింది.
సమీక్షలో ఉన్న త్రైమాసికంలో, కమ్యూనిటీ ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ప్రపంచవ్యాప్తంగా 6.48 మిలియన్లకు పైగా వీడియోలను YouTube ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. వీటిలో 19 లక్షలకు పైగా వీడియోలు భారతదేశం నుంచి మాత్రమే ఉన్నాయి.
YouTube ‘కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్’ నివేదిక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ స్వీకరించిన ఫిర్యాదుల రకాలు, వాటిపై ఎలాంటి చర్య తీసుకుంది అనే సమాచారాన్ని అందిస్తుంది.
భారతదేశంలో ఫిర్యాదుల ఆధారంగా జనవరి-మార్చి 2023లో YouTube 1.9 మిలియన్లకు పైగా వీడియోలను తీసివేసింది. యుఎస్‌లో 6.54 లక్షల వీడియోలు, రష్యాలో 4.91 లక్షల వీడియోలు , బ్రెజిల్‌లో 4.49 లక్షల వీడియోలు తొలగించారు.

కమ్యూనిటీ మార్గదర్శకాలు హానికరమైన కంటెంట్ నుంచి YouTube కమ్యూనిటీని రక్షించాయని YouTube పేర్కొంది. తాము మెషిన్ లెర్నింగ్ అండ్ రివ్యూయర్స్ రెండింటినీ ఉపయోగించి యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను అమలు చేస్తాము”అని వెల్లడించింది యూట్యూబ్ సంస్థ.