ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు యువతకు స్ఫూర్తి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన గుకేశ్ దొమ్మరాజుకు హృదయపూర్వక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన గుకేశ్ దొమ్మరాజుకు హృదయపూర్వక అభినందనలు. చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్‌గా నిలిచి గుకేశ్ చరిత్ర సృష్టించడం భారతీయులందరికీ గర్వకారణం.

ప్రఖ్యాత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత, గుకేశ్ ఛాంపియన్‌గా నిలిచినందుకు చెస్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.ఆనంద్ స్ఫూర్తితో అనేక మంది భారతీయ చెస్ క్రీడాకారులు ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచారు.

మన తెలుగు రాష్ట్రాల నుంచి కోనేరు హంపి, పి.హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, వర్షిణి, అర్జున్ గ్రాండ్ మాస్టర్స్‌గా నిలిచినట్లు, ఇప్పుడు గుకేశ్ కూడా నవతరం చెస్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. గుకేశ్ దొమ్మరాజు తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందినవాడై, ఈ విజయంతో తెలుగువారికి మరింత ఆనందాన్ని కలిగించాడు.

భవిష్యత్తులో గుకేశ్ మరిన్ని విజయాలను సాధించాలని, ఇంకా ఉన్నత స్థాయిలను అధిగమించాలని ఆకాంక్షిస్తున్నాను.

About Author