“అంబేద్కర్ ఆశయాల బాటలోనే సాగుతాం” – పవన్ కల్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 14,2025: దేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 14,2025: దేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ప్రపంచ రాజ్యాంగాల్లో అత్యుత్తమంగా భారత రాజ్యాంగం నిలిచింది. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి పౌరుడికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్,” అని కొనియాడారు.

ఇది కూడా చదవండి..శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించిన అన్నా కొణిదల

ఇది కూడా చదవండి..“తెలంగాణ ప్రభుత్వంతో గోద్రెజ్ క్యాపిటల్ ఆర్థిక సహకారం: MSMEలకు కొత్త రుణ అవకాశాలు”

ఆర్థిక అంశాల కన్నా సామాజిక అసమానతలే వెనకబాటుకు ప్రధాన కారణమని అర్థం చేసుకున్న అంబేద్కర్, తన జీవితం, విద్యార్హత ద్వారా సమసమాజ స్థాపనకు పునాది వేశారు. వెనుకబడిన వర్గాల్లో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని పారద్రోలేందుకు విద్యను ఆయుధంగా వాడాలనే సంకల్పంతో పనిచేశారని పవన్ పేర్కొన్నారు.

కేంద్రంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు చేరవేసేందుకు కట్టుబడి ఉందన్నారు. అంబేద్కర్ జీవితంలో కీలకమైన జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, చైత్యభూమి, పరినిర్వాణభూమి ప్రాంతాలను సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

Read this also…Godrej Capital and Government of Telangana Sign MoU to Boost MSME Growth

Read this also…Bank of India Celebrates 10 Years of Transformative Impact Through Pradhan Mantri Mudra Yojana

అలాగే రాష్ట్రంలో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. గత పాలకుల హయాంలో చోటుచేసుకున్న డా.సుధాకర్ అవమాన ఘటన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనలు బాధాకరంగా నిలిచాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. “ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. కూటమి పాలనలో బలహీన వర్గాలకు పూర్తి భరోసా ఇస్తాం. బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం,” అని తెలిపారు.

About Author