ఎస్వీ మ్యూజియానికి పురాతన వస్తువులను విరాళం ఇచ్చిన దాత..
వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 1,2023: అమెరికాలో ఉంటున్న వింజమూరి సంధ్య తిరుమలలోని ఎస్వీ మ్యూజియానికి లక్షల రూపాయలు విలువచేసే పురాతన
వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 1,2023: అమెరికాలో ఉంటున్న వింజమూరి సంధ్య తిరుమలలోని ఎస్వీ మ్యూజియానికి లక్షల రూపాయలు విలువచేసే పురాతన వస్తువులను విరాళంగా అందజేశారు. ఆయా వస్తువులను తిరుమలలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
డా. వింజమూరి వరదరాజ అయ్యంగార్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. వీరు టీటీడీ ఉత్సవాల్లో పలు ప్రదర్శనలిచ్చారు. అన్నమాచార్య ఉత్సవాలు ప్రారంభించిన నాటి నుంచి ప్రముఖ సంగీత విద్వాంసులుగా ఉన్నారు.
ఎంఎస్.సుబ్బలక్ష్మి,వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మతో కలిసి పనిచేశారు. వీరు ఉపయోగించిన, సేకరించినవాటిలో తంబూరాలు, వేణువులు వంటి సంగీత పరికరాలతోపాటు, వారు పూజించిన పంచలోహ శ్రీనమ్మాళ్వార్ విగ్రహం, చిన్న భగవద్గీత, వెండితో చేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల పటాలు, దంతపు నగిషీలు చెక్కిన కళాఖండాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మ్యూజియం అధికారి డా. కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.