అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (55వ IFFI, GOA) లో ప్రదర్శించనున్న ‘వికటకవి’, ‘డిస్పాచ్’

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 18,2024: అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ZEE5 ఒరిజినల్ సీరిస్‌లైన ‘డిస్పాచ్’ మరియు ‘వికటకవి’

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 18,2024: అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ZEE5 ఒరిజినల్ సీరిస్‌లైన ‘డిస్పాచ్’ మరియు ‘వికటకవి’ ప్రత్యేక స్క్రీనింగ్ చేయబోతోన్నాయి. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ‘డిస్పాచ్’ సీరిస్ నవంబర్ 21న స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘వికటకవి’ నవంబర్ 23న ప్రదర్శించబడుతుంది.

https://x.com/ZEE5Global/status/1858407097026679220

డిస్పాచ్:

కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, షహానా గోస్వామి, అర్చిత అగర్వాల్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి అనుభవజ్ఞుడైన క్రైమ్ జర్నలిస్ట్ పాత్ర (జాయ్)లో నటించారు. అధికార, నైతికత ,వ్యక్తిగత సంఘర్షణల మధ్య చిక్కుకున్న జాయ్ ప్రయాణం ఈ కథలోని ప్రధాన అంశం.

వికటకవి: ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి:

‘వికటకవి’ ఒక థ్రిల్లింగ్ డిటెక్టివ్ సిరీస్, ఇది అమరగిరి అనే రహస్య ప్రదేశం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ రామకృష్ణ అనే యువ పరిశోధకుడు ఒక రహస్యమైన కేసులో చిక్కుకుంటాడు. నల్లమల్ల అడవిలో ప్రవేశించిన తర్వాత గ్రామస్థులు రహస్యంగా తమ జ్ఞాపకాలను కోల్పోతుంటారు. రామకృష్ణ మరింత లోతుగా పరిశోధన చేస్తూ కొన్ని అద్భుతమైన రహస్యాలు బయటపడతాయి. 1970ల నాటి తెలంగాణ నేపథ్యంతో రూపొందించిన ఈ తెలుగు ఒరిజినల్ సీరిస్, ఆ సమయంలోని సాంస్కృతిక, ఆచార, సంప్రదాయాలను అద్భుతంగా చూపిస్తుంది.

https://x.com/ZEE5Telugu/status/1858449443781222738

IFFI 2024:

55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (IFFI) 2024 గోవాలో నవంబర్ 20 నుండి 28వ తేదీ వరకు జరుగనుంది. ఈ క్రమంలో ‘వికటకవి’ వెబ్ సిరీస్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా డిస్పాచ్ డైరెక్టర్ కను బెహ్ల్ మాట్లాడుతూ, “మా సిరీస్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించడాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా గొప్ప అనుభూతి. ఇది నా మొదటి IFFI అనుభవం, చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు.

https://www.instagram.com/p/DCbd_ApORzr

వికటకవి దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ, “IFFI వేదికపై వికటకవి ప్రీమియర్ ప్రదర్శించడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక వేదికపై నా పని ప్రదర్శించేందుకు అవకాశం కలగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్‌లో సాంస్కృతిక మూలాలు, gripping మిస్టరీ ఉన్నా, ప్రత్యేకించి అది తెలంగాణ ప్రాంతపు స్థానిక చరిత్రను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. రైటర్ సాయితేజ దేశ్‌రాజ్‌గారు చాలా మంచి కథను అందించారు. ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా రూపొందించాం. ఈ ప్రాజెక్ట్‌ను IFFI వేదికపై ప్రదర్శించాలనే ఉత్సాహంతో ఉన్నాను” అన్నారు.

About Author