వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 17,2024:హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవలసిన ఇతిహాసం రామాయణం. మన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 17,2024:హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవలసిన ఇతిహాసం రామాయణం. మన వాఙ్మయంలో ఆదికావ్యంగా నిలిచిన రామాయణాన్ని సంస్కృతంలో రచించి భారతావనికి అందించిన మహనీయుడు వాల్మీకి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి జీవితాన్ని, పరిపాలనను కళ్ళకు కట్టే రామాయణం ప్రజలకు నైతిక వర్తనను వెల్లడిస్తుంది. ధర్మాన్ని అనుసరించి ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకి ఋషి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. రామాయణ మహా కావ్యాన్ని మానవాళికి అందించిన వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వేటగాడైన రత్నాకరుడు తారక మంత్రోపదేశం పొంది వాల్మీకిగా మారి రామాయణ కావ్యాన్ని రచించిన క్రమాన్ని తెలుసుకొంటే ఆధ్యాత్మిక జ్ఞానం విలువ తెలుస్తుంది. నేడు వాల్మీకి జయంతి సందర్భంగా దైవ చింతన కలిగే ప్రతి ఒక్కరికీ, వాల్మీకిని ఆరాధించేవారందరికీ శుభాకాంక్షలు.