కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మార్చి 10,2025: తిరుమలలో మార్చి 14న జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు . శుక్రవారం ఉదయం 5

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మార్చి 10,2025: తిరుమలలో మార్చి 14న జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు . శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులను కుమారధార తీర్థ దర్శనానికి అనుమతించనున్నారు.
ఆరోగ్య పరిమితులు ఉన్న భక్తులు, చిన్న పిల్లలు, వృద్ధులు ఈ తీర్థయాత్రకు అనుకూలం కాదని అధికారులు సూచిస్తున్నారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న భక్తులు నడిచి వెళ్లేందుకు అనుమతి లేదు. భక్తుల భద్రత దృష్ట్యా, గోగర్భం నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల ద్వారానే రవాణా ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు.
Read this also…Workshop on “Online Journalism – Empowering Women Journalists” under the auspices of the TMedia Academy
ఇది కూడా చదవండి…తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ జర్నలిజంపై మహిళా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు
Read this also…Experience the Best of K-Dramas on Tata Play K-Dramas..
భద్రత పరంగా పాపవినాశనం నుంచి కుమారధార తీర్థం వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సెక్యూరిటీ సిబ్బందిని మోహరించనున్నారు. మార్గమధ్యంలో తాగునీటి సదుపాయాలను అందుబాటులో ఉంచి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.

అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 5 గంటల నుంచి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం వంటివి అందించనున్నారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేయడానికి అనుమతి లేదు.
భక్తుల సౌకర్యార్థం ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మార్గమధ్యంలో షెడ్లు, నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
Read this also…Jawa Yezdi and BSA Launch Segment-Leading Ownership Assurance Program
ఇది కూడా చదవండి…జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు
భక్తులందరూ సూచనలు పాటించి భక్తిశ్రద్ధలతో కుమారధార తీర్థ దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.