రథసప్తమి కోసం టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు సమీక్ష..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 31,2025: రథసప్తమి కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి నాడు స్వామివారు ఏడు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 31,2025: రథసప్తమి కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి నాడు స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ఈ రోజున తిరుమలకు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసారు.
రద్దీని దృష్టిలో ఉంచుకుని, రథసప్తమి నాడు అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు మరియు సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో SSD టోకన్లు జారీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ పర్వదినం సందర్భంగా 1250 మంది పోలీసులు, 1000 మంది ప్రత్యేక భద్రతా బృందాలు నియమించి, భక్తుల భద్రతను కాపాడతారు. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా ఆక్టోపస్, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఏపిఎస్పీ, అగ్నిమాపక దళాలు పనిచేస్తాయని చెప్పారు.

వాహనసేవలు తిలకించేందుకు గ్యాలరీల్లో వేచిఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు పంపిణీ చేయబడతాయి.
పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలతో తిరుమల అలంకరించబడుతుంది.
ఈ ఏడాది 8 లక్షల లడ్డూలు నిల్వ చేసుకున్నారు.
తిరుపతిలో జనవరి 8న జరిగిన దురదృష్ట ఘటనను దృష్టిలో ఉంచుకుని, రథసప్తమి నాడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
“తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించాను” అని బీఆర్ నాయుడు వెల్లడించారు.

మహాకుంభామేళా ప్రయాగ్ రాజ్ లో టీటీడీ నమూనా ఆలయం అద్భుతంగా ఉందని, అక్కడ రోజుకు 10 వేల మంది భక్తులు దర్శనమిస్తున్నారు. తిరుమల తరహాలో అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.