నలుగురు యువకుల దుర్మరణం బాధాకరం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 5,2024: నిడదవోలు నియోజకవరంలోని తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 5,2024: నిడదవోలు నియోజకవరంలోని తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతున్న నలుగురు యువకులు విద్యుదాఘాతానికి గురై మరణించడం, మరో యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడని తెలిసి మనసును కలచి వేసింది.
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే యువకులు దుర్మరణం పాలవడం బాధాకరం. వారి తల్లిదండ్రుల గుండె కోతను నేను ఉహించగలను. సంఘటన స్థలానికి వెళ్లి, బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిస్థితులను తెలియచేశారు.

మరణించిన యువకులలో ఒకరు జనసేనలో చురుకైన కార్యకర్తని తెలిసింది. గాయపడిన యువకుడు కోలుకోవడానికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించమని, బాధిత కుటుంబాలకి తగిన నష్టపరిహారం అందేలా చూడాలని దుర్గేష్ కి స్పష్టం చేశాను.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.