ఇది మంచి ప్రభుత్వం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 29, 2024:కూటమి పాలన మొదలైన 100 రోజులు దాటాయి. ముందుగా శాఖాపరమైన అధ్యయనం చేసి, ప్రజా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 29, 2024:కూటమి పాలన మొదలైన 100 రోజులు దాటాయి. ముందుగా శాఖాపరమైన అధ్యయనం చేసి, ప్రజా ప్రయోజనం, అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన శాఖల్లోని పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ దిశగా చేపట్టిన శాఖలు,అందులోని విభాగాల అధికారులతో పలు సమావేశాలు నిర్వహించాను. ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, వారికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధేశించాలని భావించాను.

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన సభ, మంత్రి మండలి సమావేశాల్లో ‘కూటమి ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసేలా పని చేస్తుంది’ అని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా, ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా, పక్షపాతం రహితంగా నిర్వహించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశాను. ప్రతిభ, సమర్థత, నిబంధనలు కొలమానాలుగా తీసుకోవాలని సూచించాను.

ప్రజా ప్రతినిధులు, సహచర మంత్రుల సిఫార్సులను కూడా బదిలీల కొలమానాలకు అనుగుణంగా పరిగణించుకోవాలని సూచించాను. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ఏపీడీలు, డి.పి.ఓలు, జిల్లా పరిషత్ సి.ఈ.ఓలు బదిలీల ప్రక్రియ ప్రారంభించడానికి ముందు మా కార్యాలయం పూర్తి సమాచారాన్ని సేకరించింది. కొందరు అధికారులు గత పాలకుల ప్రాపకం మూలంగా, నాటి బదిలీలలో జరుగుతున్న లావాదేవీల వల్ల ఒకే ప్రాంతంలో కీలక పోస్టుల్లో మారుతున్న వారిగా కనిపించారు.

పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలతో సంబంధం లేని జైళ్ల శాఖ, ఖజానా శాఖ… ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులు జిల్లా పోస్టుల్లో పని చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రతిభ, సమర్థత, సమగ్రత ఉన్న అధికారులు అప్రాధాన్యంగా మిగిలిపోతున్నారు. వారికి కుల సమీకరణం లేదా రాజకీయ సమీకరణాల వల్ల తగిన గుర్తింపు దక్కలేదు.

బదిలీ ప్రక్రియ ప్రారంభించిన వెంటనే, సేకరించిన సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. నిర్దేశించిన కొలమానాలకు అనుగుణంగా లేని పక్షంలో ఆ అధికారులను ఇతర స్థానాలకు పంపించారు. పి.ఆర్., ఆర్.డీ. అధికారులకు మాత్రమే డ్వామా పి.డి., ఏపీడీ, జడ్పీ సి.ఈ.ఓ. పోస్టులు ఇవ్వాలని నిర్ణయించాం. అందువల్ల ఇతర శాఖల నుంచి ఈ శాఖలోకి రావాలనుకున్నవారిని పరిగణించలేదు.

ఏ దశలోనూ బదిలీల విషయంలో ఆర్థిక లావాదేవీలకు తావు లేకుండా చూసుకున్నాం. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో ఇంత పారదర్శకంగా, లంచాలకు ఆస్కారం లేకుండా బదిలీలు జరగడం ఇటీవలి సంవత్సరాల్లోనే జరిగింది. ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన, వార్తా కథనాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

మా కూటమికి ఆశ్రిత పక్షపాతం లేదు. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే నిర్ణయాలు తీసుకుంటాము. నిర్ణయాలకు కట్టుబడి ఉంటాము. సిఫార్సులు, సూచనలు చేసిన ప్రజా ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులకు వివరించాము, ఎవరికైనా ఆ స్థానం ఇవ్వలేకపోయామో.

అధికారులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించే విధంగా బదిలీలు చేశాం. రాయలసీమ ప్రాంతంలో ఒక అధికారి ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాలు దాటింది. అతనికి అవసరమైన పోస్టింగ్ ఇచ్చాం. గతంలో చురుగ్గా పనిచేసిన వారికి మరో జిల్లా అప్పగించాము. నివేదికలో ఆరోపణలు వచ్చిన వారికి కీలక బాధ్యతలు ఇవ్వలేదు.

ఈ కసరత్తు ఎందుకు చేయడం జరిగిందంటే, గత పాలకులు పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మళ్లించడం, నిధులను రాబట్టుకోలేక పోవడం వంటి చర్యలతో గ్రామ సర్పంచులు ఏమీ చేయలేని స్థితికి వెళ్లిపోయారు.

గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి తగిన నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ స్థాయిలో అభివృద్ధి మొదలుపెట్టాలనే స్పష్టమైన లక్ష్యాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ నుంచి రూ.4500 కోట్లు ఉపాధి హామీ నిధులను అందుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1987 కోట్లు వచ్చాయి.

2027 నాటికి జల్ జీవన్ మిషన్ ద్వారా 95.44 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా రక్షిత నీరు సరఫరా చేయాలని లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.215.8 కోట్లు బడ్జెట్ ను ఆమోదించింది. అవసరమైన నిధులు పొందుతూ పంచాయతీల్లో అభివృద్ధి పనులను చురుగ్గా పూర్తి చేయాలి.

సమర్థులైన, సమగ్రత కలిగిన అధికారులకు బాధ్యతలు అప్పగించేందుకు బదిలీల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాము. కొత్త బాధ్యతలు చేపట్టిన అధికారులను ప్రభుత్వ లక్ష్యాల దిశగా తీసుకువెళ్తాము. పర్యవేక్షణకు ఉన్నతాధికారులను ఆదేశించాను.

ప్రజా భాగస్వామ్యాన్ని ధ్యేయంగా, గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన కోసం ఉన్నత అధికారులకు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని సూచించాను.

ఇది మంచి ప్రభుత్వం: ప్రజలకు సేవ చేయడానికి, మంచి పాలన అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

About Author