శ్రీ వేంకటేశ్వరస్వామివారి మోహినీ అలంకార సేవా వైభవం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 2,2025: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 2,2025: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనార్థం భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో నిండిపోయారు.
ఇది కూడా చదవండి...L2 ఎంపురాన్’ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రను రివీల్ చేసిన చిత్ర బృందం
Read this also... L2: Empuraan Goes Global – Game of Thrones Star Jerome Flynn Joins the Cast
ఇది కూడా చదవండి...స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ – భారత్‌లో అతిపెద్ద హోమ్ హెల్త్ కేర్ నెట్‌వర్క్ విస్తరణ
భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాల గుజరుతో బ్రహ్మోత్సవ ప్రాంగణం పులకరించిపోయింది. ఐదో రోజు ఉదయం జగత్కళ్యాణకారకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు దివ్య మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచ్చిపై చిన్న కృష్ణుడు స్వామివారి మహిమను ప్రతిబింబిస్తూ భక్తుల మనసులను పరవశింపజేశాడు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి మోహినీ అవతారం భక్తులకు భౌతిక, ఆధ్యాత్మిక రీతుల్లో ప్రత్యేక అనుభూతిని కలిగించింది. భౌతికంగా జగన్మోహకత్వాన్ని, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని అనుభవింపజేసింది.
Read this also... Star Health Insurance Expands Home Health Care Network to 100 Locations Across India
Read this also...Godrej Enterprises Group’s Locks and Architectural Solutions Shines at India Design Mark Awards 2024
మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు, వాహ్య వాహకభేదాన్ని గుర్తించలేకపోయింది. ఈ మాయామోహాన్ని చూరగొనేందుకు స్వామివారు జగన్మోహినిగా పల్లకీలో కూర్చొని భక్తులను అనుగ్రహించారు.
ఈ మంగళోత్సవాన్ని చూసేందుకు భక్తజనం భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.