‘ది డీల్’ సినిమా సమీక్ష..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 18,2024: ‘ది డీల్’ చిత్రం, హను కోట్ల దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం. ఈ సినిమా అక్టోబర్ 18న

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 18,2024: ‘ది డీల్’ చిత్రం, హను కోట్ల దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం. ఈ సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హను, ఈటీవీలో ప్రసారమైన మాయాబజార్ సీరియల్‌లో 150 ఎపిసోడ్స్ పూర్తి చేసి, ఇప్పుడు వెండితెరపై తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

స్టోరీ..

భైరవ్ (హను కోట్ల) ఒక ప్రమాదంలో గాయపడతాడు. ఆ ప్రమాదం వల్ల అతను తన గతాన్ని మరిచి, తన భార్య లక్ష్మిని (ధరణి ప్రియా) వెతుకుతాడు. కానీ ఆశ్చర్యంగా, ఆమె అతనిని కాకుండా మరొకరిని తన భర్తగా పరిచయం చేస్తుంది. ఇది భైరవ్‌కి షాక్ గా ఉంటుంది, అతను తన గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటాడు, వాటిలో అతని స్నేహితుడు గిరి అతనిని చంపడానికి ప్రయత్నిస్తాడు.

భైరవ్ తన అనుమానాలను తీర్చుకునే ప్రయత్నంలో, అతని మెదడు సరైన రీతిలో పని చేయడం లేదని డాక్టర్ చెబుతాడు. అయినప్పటికీ, అతను నిజాలు తెలుసుకునేందుకు పోరాడుతాడు. భైరవ్ తన ఇంటికి తిరిగి వెళ్లి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తాడు, కానీ లక్ష్మి ఇతర వ్యక్తితో ఉన్నట్లు అనుమానిస్తాడు.

అనాలసిస్..

ఈ సినిమా మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగుతుంది, కానీ సెకండాఫ్‌లో సస్పెన్స్, ట్విస్ట్‌లు, డ్రామా మిళితమై మరింత ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా, భైరవ్ ఎవరు? లక్ష్మి ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి.

దర్శకుడు కథలో మంచి ట్విస్ట్‌లను సమకూర్చారు, అయితే సినిమాకి కొంత స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్ మిస్ అవుతోంది. కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ అంశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి, ప్రత్యేకించి తల్లి సెంటిమెంట్.ఈ చిత్రం కుటుంబంతో కలిసి వీకెండ్‌లో చూడదగ్గ సినిమా.

దర్శకుడు హను కోట్ల..
స్రవంతి: సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్
నిర్మాతలు: హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి
కథానాయికలు: చందన, ధరణి ప్రియా
విడుదల తేదీ: అక్టోబర్ 18, 2024
రేటింగ్: 3/5..

About Author