సింహ వాహన సేవలో శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఫిబ్రవరి 28,2025: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ యోగ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఫిబ్రవరి 28,2025: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు బ్రహ్మోత్సవ వేడుకలను మరింత రంజుగా మార్చాయి.

ఇది కూడా చదవండి...టీటీడీ ఉద్యోగాల భర్తీకి స్పోర్ట్స్ కోటా – వార్షిక క్రీడాపోటీల ప్రారంభం

ఇది కూడా చదవండి...గ్రోమ్యాక్స్ 25వ వార్షికోత్సవం – కొత్త ట్రాక్టర్ల ఆవిష్కరణ

Read this also...Gromax Agri Equipment Celebrates 25 Years of Excellence Under Mahindra & Gujarat Government JV

Read this also...Canon India Introduces Free Camera Colour Matching App to Enhance Remote Video Production

శ్రీ వేంకటేశ్వరస్వామివారు బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ సంకేతంగా సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి ప్రతీక.

ఉదయం నిద్రలేవగానే సింహదర్శనం కలిగితే శక్తి, ఉత్సాహం పెరుగుతాయని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. సోమరితనం తొలగి పట్టుదలతో విజయసాధన కోసం స్ఫూర్తి కలుగుతుందని విశ్వసిస్తారు.

ఇది కూడా చదవండి...EUలో ICS2 విస్తరణ: ఏప్రిల్ 1 నుంచి రైలు, రోడ్డు రవాణాకు అమలు

Read this also...EU Expands Import Control System 2 (ICS2) to Rail and Road from April 2025

Read this also...MG COMET BLACKSTORM: A Bold New Avatar for India’s Street-Smart EV

శ్రీ వేంకటేశ్వరస్వామి తన వాహనమైన సింహంతో కలిసి, దుష్టశిక్షణకు, భక్తుల రక్షణకు సంకల్పబద్ధంగా పనిచేస్తున్నామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Author