తిరుపతిలో వైకుంఠద్వార దర్శనానికి భక్తులకు ప్రత్యేక అవకాశం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జనవరి 12,2025: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టికెట్ కౌంటర్ల వద్ద జనవరి 11న జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జనవరి 12,2025: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టికెట్ కౌంటర్ల వద్ద జనవరి 11న జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తులు కోలుకొని ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

టీటీడీ చైర్మన్ బీవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు బాధిత భక్తులకు ప్రత్యేక ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ నిర్వహించింది.

అనుకోని ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి, వారిని త్వరగా కోలుకునేలా చూసుకోవాలని, అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలని టీటీడీ చైర్మన్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంలో భక్తులు మాట్లాడుతూ, టీటీడీ అధికారులు తమను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని, గాయాల నుంచి త్వరగా కోలుకునేలా అన్ని విధాలా సహాయం చేశారని అన్నారు. ప్రభుత్వం, టీటీడీ బోర్డు చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అదేవిధంగా, తమకు పరిహారం అందించి, తమ గమ్యస్థానాలకు చేరుకునే ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, టీటీడీ చైర్మన్ బీవీ సుబ్బారెడ్డికి, అధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు.

About Author