సావిత్రీబాయి ఫూలే 194వ జయంతి,5వ అఖిలభారత అవయవ దాతల మహాసభలు గుంటూరులో ఘనంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 3,2024: సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్,అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 3,2024: సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్,అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే 194వ జయంతి, అఖిల భారత అవయవ దాతల సంఘం 5వ మహాసభలు జనవరి 3న గుంటూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల జింఖాన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి గూడూరు సీతా మహాలక్ష్మి నేతృత్వం వహించగా, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. విశిష్ట అతిథిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు, గౌరవ అతిథులుగా సాదు నరసింహారెడ్డి (ఐఆర్ఎస్, సీజీఎస్టీ కమిషనర్) ,ప్రముఖ కార్డియాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పాల్గొన్నారు.

కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి పెద్ద సంఖ్యలో శరీర, అవయవ దాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మానవతా సేవలకు గాను మానవత, జన వారధి సర్వీస్ సొసైటీ, వాక్ ఫౌండేషన్, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ వంటి సంస్థలకు సేవా పురస్కారాలు అందజేశారు.

ప్రముఖ వక్తలు సావిత్రీబాయి పూలే మహిళా సాధికారత కోసం చేసిన పోరాటం, ఆమె జీవిత పాఠాలు ప్రతి ఒక్కరికీ స్పూర్తినిచ్చే విధంగా ఉంటాయని వివరించారు. ఆవయవ దానం ప్రాధాన్యత గురించి చర్చించడంతో పాటు, దాతల సేవలను ప్రశంసిస్తూ మానవతా విలువలు పెంపొందించాల్సిన అవసరాన్ని వక్తలు ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా సాగింది. అవయవ దానానికి సంబంధించి యువత, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే మా లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

About Author

You may have missed