ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వజ్రోత్సవాలకి ఆహ్వానించిన PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 9,2024: ఈనెల 20,21 తేదీల్లో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 9,2024: ఈనెల 20,21 తేదీల్లో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆహ్వానించారు.

రాష్ట్ర శాసనసభ ఆవరణలో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య మంత్రిని కలిసిన జానయ్య ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు హాజరు కావడంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ని కూడా అల్దాస్ జానయ్య కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. అలాగే అనేకమంది మంత్రులని, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిలను కూడా అల్దాస్ జానయ్య కలిశారు. విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.

About Author