పెనుగొండ, మొగల్తూరులో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఏప్రిల్ 3,2025: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో పెనుగొండ, మొగల్తూరు గ్రామాల్లో చెత్త సమస్యకు పరిష్కారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఏప్రిల్3,2025: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో పెనుగొండ, మొగల్తూరు గ్రామాల్లో చెత్త సమస్యకు పరిష్కారం దొరికింది. గత నెల 28న జరిగిన గ్రామ అభివృద్ధి సభల్లో ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సమస్య పరిష్కారం యుద్ధప్రాతిపదికన జరుగుతోంది.

ఇప్పటికే పెనుగొండ హైస్కూల్‌కు ₹2.05 కోట్లు, మొగల్తూరు హైస్కూల్‌కు ₹1.71 కోట్లు మంజూరైంది. తాజాగా గ్రామాల్లో చెత్తపరంగా మారుతున్న సమస్యకు పరిష్కారం తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ప్రజలు కోరగా, ఉపముఖ్యమంత్రి దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

Read this also…Prozeal Green Energy Limited Files DRHP with SEBI for IPO

ఇది కూడా చదవండి..జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్ ₹2,000 కోట్ల ఐపీవో కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు

పెనుగొండలో 200 టన్నులు, మొగల్తూరులో 400 టన్నుల చెత్త తొలగింపు

పెనుగొండ గ్రామ పంచాయతీలో గత 9 ఏళ్లుగా పేరుకుపోయిన 200 మెట్రిక్ టన్నుల చెత్తను రీ సైక్లింగ్ కేంద్రాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. మొగల్తూరు గ్రామంలో గత 10 ఏళ్లుగా పేరుకుపోయిన 400 మెట్రిక్ టన్నుల చెత్తను సంపద సృష్టి కేంద్రాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు.

భవిష్యత్తులో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం శాశ్వత చెత్త నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Read this also…Jain Resource Recycling Limited Submits DRHP to SEBI for ₹2,000 Crore IPO

గ్రామాల్లో చెత్త సమస్యను పూర్తిగా తొలగించడంతో పాటు, పారిశుధ్య సంరక్షణ, పచ్చదనాన్ని పెంచే చర్యలు వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

About Author