గ్రామ స్వరాజ్యం కోసం బాటలు వేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 23,2024:సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక జీవన శైలిలో నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 23,2024:సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక జీవన శైలిలో నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, గ్రామ స్వరాజ్యం కోసం బాటలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేద్దాం.

గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక బాధ్యతగా భావించి గ్రామంలోని మహిళలు, పురుషులు ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. మన ఊరు, మన సమస్య, సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషించే దిశగా నిర్వహిస్తోన్న గ్రామ సభల్లో గ్రామస్తులు అంతా పాల్గొని మన గ్రామ అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలతో గ్రామాన్ని ముందుకు నడిపించవచ్చు అని పరస్పరం చర్చించుకునే అవకాశం గ్రామ సభల్లో ఉంటుంది. ప్రతీ గ్రామంలోని గ్రామస్తులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ సభలను విజయవంతం చేయాలి.

నాయకుడు అంటే కేవలం పనులు చేయించడం మాత్రమే కాదు వారు కూడా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి ప్రజలతో మమేకమై పనులు చేసే వారిని నిజమైన నాయకులు అంటారు. అలాంటి నిజమైన నాయకత్వానికి అర్థం చెప్పే విధంగా గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం, గ్రామాల అభివృద్ది కోసం గ్రామ సభలకు హాజరయ్యి ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు.

సగటు పౌరుల ప్రధాన కనీస అవసరాలైన మంచి నీరు, సాగునీరు, రహదారులు, పరిశుభ్రత, విద్యుత్తు, మురికి నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను చక్కదిద్దుకుందాం.

దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ఆగష్టు 23న అంకురార్పణ అవుతున్న 13,326 గ్రామ సభల్లో భాగంగా మన గ్రామంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించుకుందాం. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను చేపట్టనున్నారు.

దీని ద్వారా మొత్తం 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించనున్నారు. మన సమస్యల శాశ్వత పరిష్కారాలకు ప్రణాళికలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలుద్దాం. సంపదను సృష్టించే వనరులు, చేతి వృత్తులు, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిద్దాం.

About Author