ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 5,2025: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, శాసన సభ్యుల కోటాలో నిర్వహించదలచిన ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలో భాగంగా కొణిదెల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 5,2025: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, శాసన సభ్యుల కోటాలో నిర్వహించదలచిన ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలో భాగంగా కొణిదెల నాగబాబు పేరును అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం నాగబాబు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.
Read this also...Blue Star Unveils 150 New Room AC Models, Strengthens Presence in Smart WiFi & Heavy-Duty Segments
Read this also...Tata Steel Commemorates the 186th Birth Anniversary of Jamsetji Nusserwanji Tata
Read this also...Leopard Spotted on Alipiri Walkway in Tirupati, Sparks Fear Among Devotees
నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాదు నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయసిబ్బందికి కూడా ఆయన సూచించారు.

ఈ నిర్ణయంతో జనసేన శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా, నాగబాబు ఈ స్థానం ద్వారా రాజకీయంగా మరింత బలపడతారని, అలాగే రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించగలిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.