గోశాల ప్రసాద్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 15,2025: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులైన గోశాల ప్రసాద్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 15,2025: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులైన గోశాల ప్రసాద్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వారిపై తన సంతాపాన్ని తెలియజేస్తూ, “జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగిన గోశాల ప్రసాద్ ప్రజా సమస్యలపై సాహసోపేతంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచేవారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చా వేదికలపై ప్రజా పక్షాన్ని నిబద్ధతతో వినిపించారు. ఆయన ఆకస్మిక మరణం జర్నలిజం రంగానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని అన్నారు.

About Author