గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 15వ వార్షిక క్రీడోత్సవం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 31, 2025: అత్తాపూర్‌లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ తమ 15వ వార్షిక క్రీడోత్సవాన్ని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 31, 2025: అత్తాపూర్‌లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ తమ 15వ వార్షిక క్రీడోత్సవాన్ని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. ‘ఖేల్ మహోత్సవ్’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సందర్శకులు కలిపి సుమారు 2000 మంది హాజరై క్రీడోత్సవాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన ట్రాక్ ఈవెంట్స్, వినోదాత్మక ఆటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కరాటే, స్కేటింగ్, అబాకస్, కీబోర్డ్, యోగా వంటి కార్యక్రమాలతో పాటు రంగురంగుల డ్రిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అకాడమిక్ ఎక్సలెన్స్, స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్, లిటరరీ స్కాలర్‌షిప్, ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ విభాగాల్లో ఐదు ఇంటర్ హౌస్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలను ప్రదానం చేశారు. అలాగే 2025 సీబీఎస్సీ బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులను ఈ వేదికపై మెడల్స్‌తో సత్కరించారు. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి థ్రోబాల్, ఖో-ఖో, చెస్ వంటి క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ బాస్కెట్‌బాల్ హెడ్ కోచ్, వైఎంసీఏ సికింద్రాబాద్ స్పోర్ట్స్ డైరెక్టర్ డా. యూజిన్ జార్జ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. అంతర్జాతీయ స్విమ్మింగ్ మెడలిస్ట్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ హెడ్ కోచ్ శ్రీ సంతోష్ చారి గౌరవ అతిథిగా పాల్గొని, విద్యార్థుల క్రమశిక్షణ, జట్టు స్పూర్తిని ప్రశంసించారు. శారీరక కార్యకలాపాలు, స్క్రీన్ టైమ్ మధ్య సమతుల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు.
క్రీడోత్సవాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అన్నపూర్ణ కోడూరు మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు కృషి, పట్టుదల వంటి విలువలను పెంపొందిస్తాయని అన్నారు.
కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ సూరపరాజు కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా ఆకట్టుకునే క్లోజింగ్ డ్యాన్స్, న్యూ ఇయర్ డిస్ప్లేతో ఈ క్రీడోత్సవం ఉత్సాహభరితంగా ముగిసింది.