2024 సెప్టెంబర్ 16న ప్రారంభం కానున్న నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్

వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్,సెప్టెంబర్ 11,2024నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ 2024 సెప్టెంబర్ 16న (సోమవారం)

వారాహి డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్,సెప్టెంబర్ 11,2024నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ 2024 సెప్టెంబర్ 16న (సోమవారం) ప్రారంభమై 2024 సెప్టెంబర్ 19న (గురువారం)  ముగుస్తుంది. ఆఫర్‌కి సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 249 నుంచి రూ. 263 వరకు ఉంటుంది. కనీసం 57 షేర్లకు, అటుపైన 57 షేర్ల గుణిజాల్లో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్ కింద బిడ్ చేసే అర్హత గల ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ. 24 మేర డిస్కౌంటు ఉంటుంది.  ఆఫర్‌లో భాగంగా 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో సెల్లింగ్ షేర్‌హోల్డర్లు 1,05,32,320 వరకు షేర్లను విక్రయించనున్నారు.

ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్, ఎంఎఫ్ఐ,  కన్జూమర్ ఫైనాన్స్, వాహన ఫైనాన్స్, అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్,వ్యవసాయ ఫైనాన్స్ వంటి ప్రధాన ఫోకస్ రంగాలకు రుణాలివ్వడం కోసం కావాల్సిన భవిష్యత్ మూలధన అవసరాలకు, అలాగే 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం క్యాపిటల్ అడెక్వసీని పాటించేందుకు కంపెనీ వినియోగించుకోనుంది.

ఆఫర్ ఫర్ సేల్ కింద సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన లీప్‌ఫ్రాగ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఇండియా (II) లిమిటెడ్ 38,44,449 వరకు షేర్లను, యాక్సియన్ ఆఫ్రికా-ఏషియా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ 12,63,965 వరకు షేర్లను, 360 వన్ స్పెషల్ ఆపర్చూనిటీస్ ఫండ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ స్పెషల్ ఆపర్చూనిటీస్ ఫండ్) 14,08,918 వరకు షేర్లను, ఎయిట్ రోడ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ మారిషస్ II లిమిటెడ్ (గతంలో ఎఫ్ఐఎల్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (మారిషస్) II లిమిటెడ్) 17,46,950 వరకు షేర్లను, ద్వార ట్రస్ట్ (కార్పొరేట్ ట్రస్టీ ద్వార హోల్డింగ్స్ ప్రాతినిధ్యంతో (గతంలో ద్వార హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,ద్వార ట్రస్టీషిప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్) 13,44,828 వరకు షేర్లను, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 9,23,210 వరకు షేర్లను విక్రయించనున్నాయి.

ఐసీఐసీఐ సెక్యూరీటస్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

About Author