భారతదేశం కోసం నివా బుపా ‘రైజ్’ – మిస్సింగ్ మిడిల్‌కు ప్రత్యేక ఆరోగ్య భద్రతా ప్రణాళిక
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 21, 2025: భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థలలో ఒకటైన నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (గతంలో మాక్స్ బుపా హెల్త్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 21, 2025: భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థలలో ఒకటైన నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (గతంలో మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని వ్యవహరించేవారు) ‘రైజ్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది- ఇది భారతదేశపు ‘‘మిస్సింగ్ మిడిల్’’ కోసం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య బీమా పథకం. విలువ, ఫ్లెక్సిబిలిటీని వశ్యతను అందించే పరిశ్రమలోని పలు మొదటి లక్షణాలతో, ‘రైజ్’ఆరోగ్య బీమాలో స్థోమతను, అందుబాటును పునర్నిర్వచించనుంది.
భారతదేశంలోని పెద్ద, చిన్న నగరాల్లో నివసించే మధ్యతరగతి విభాగానికి చెందిన వినియోగదారులతో వారి జీవనశైలి, అవసరాలను, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు సమగ్ర వినియోగదారుల అవసరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ‘‘రైజ్’’ను రూపొందించారు.
ఈ బృందంలోని వ్యక్తులు కాలానుగుణ ఆదాయాన్ని కలిగి ఉన్నారని, చక్కని ప్రాథమిక ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వల్ల వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు స్పష్టమైన ప్రయోజనాల కోసం చూస్తున్నారని వారితో మాట్లాడినప్పుడు వారి అభిప్రాయాలు ఈ అంశాలను వెల్లడించాయి.

ఈ ఇన్‌సైట్ల ఆధారంగా, నివా బుపా ఒక సరసమైన, అనుకూలకరమైన ఆరోగ్య బీమా ఉత్పత్తిని సృష్టించింది. ఇది వినియోగదారులకు సమగ్ర కవరేజీని అందించడమే కాకుండా ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రిలో లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలనుకుంటున్నారా అని ఎంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇది, అపరిమిత డిజిటల్ కన్సల్టేషన్లు, వారి సౌలభ్యానికి అనుగుణంగా ప్రీమియం చెల్లించే ఎంపికతో కలిపి ‘రైజ్’ఈ వినియోగదారుల విభాగానికి సరిగ్గా సరిపోయే ఆరోగ్య బీమా పథకంగా ఉంటుంది.
భారతదేశంలో, అక్టోబర్ 2021లో ప్రచురించిన నీతి ఆయోగ్ నివేదిక ద్వారా నిర్వచించబడిన ‘‘మిస్సింగ్ మిడిల్’’జనాభా, ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య పథకాలకు అర్హత సాధించడానికి ఎక్కువ సంపాదించే వ్యక్తులను సూచిస్తుంది. కానీ, ప్రైవేట్ ఆరోగ్య బీమా ప్రీమియంను భరించగలిగే వారి సంఖ్య చాలా తక్కువ. దాదాపు 40 కోట్ల మంది భారతీయులను కలిగి ఉన్న ఈ విభాగం, మధ్యతరగతి ప్రజలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది.
వైద్య అత్యవసర సమయాల్లో వారు అధిక ఆరోగ్య సంరక్షణ ఖర్చుల ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ తగినంత కవరేజ్ లేకపోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరసమైన ఆరోగ్య బీమా అందుబాటులో లేకుండా, ఈ సమూహంలోని చాలా మంది వ్యక్తులు తమ పొదుపులను తగ్గించడం లేదా వైద్య ఖర్చులను కవర్ చేసుకునేందుకు రుణాలు తీసుకుంటున్నారు.

ఇది దీర్ఘకాలిక ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరచడానికి, వైద్య రుణాన్ని నివారించడానికి,ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ‘‘మిస్సింగ్ మిడిల్’’ వారికి సరసమైన ఆరోగ్య బీమాను విస్తరించడం చాలా అవసరం. ‘రైజ్’అనేది భారతదేశంలోని ‘‘మిస్సింగ్ మిడిల్’’ కోసం సరిపోని కవరేజ్ అంతరాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ముఖ్యంగా ఈ కస్టమర్ విభాగాన్ని ఆకర్షించేందుకు ప్రత్యేకమైన అనుకూలీకరించిన ప్రయోజనాలను ఇది అందిస్తుంది.
రైజ్ ముఖ్య లక్షణాలు:
- ఫ్లెక్సీ-పేబెనిఫిట్: భారతదేశజనాభాలోగణనీయమైనభాగంఅనధికారికరంగంలోపనిచేస్తున్నారు; స్వయం ఉపాధి పొందేవారు, చిన్న వ్యాపారాలు కలిగి ఉంటారు, రోజువారీ వేతనాలు సంపాదించేవారు మరియు గిగ్ వర్కర్లు; వీరు అస్థిరమైన నెలవారీ ఆదాయాన్ని కలిగి ఉంటారు. ఈ సమూహానికి భరించగలిగే సామర్థ్యాన్ని అందించేందుకు, మొట్టమొదటిసారిగా ఆరోగ్య బీమా కవర్ కొనుగోలుకు కోసం ఫ్లెక్సీ-పేమెంట్అందుబాటులోకి వచ్చింది. దీనిలో వినియోగదారులు ప్రీమియం మొత్తంలో కేవలం 20% టోకెన్ చెల్లించడం ద్వారా తమ పాలసీని ప్రారంభించవచ్చు. పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు. వారు చెల్లింపులను ఎంత త్వరగా పూర్తి చేస్తే, వారికి అంత ఎక్కువ తగ్గింపు లభిస్తుంది.
ఉదాహరణ- మొత్తం రూ.10,000 ప్రీమియం కోసం, కస్టమర్ పాలసీని ప్రారంభించేందుకు, మరియు పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా బ్యాలెన్స్ ప్రీమియం చెల్లించడానికి రూ.2000 (రూ.10,000లో 20%) టోకెన్ మొత్తాన్ని చెల్లించాలి. పాలసీని యాక్టివ్‌గా ఉంచడానికి, వినియోగదారుడు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌గా రూ.400 (రూ.8000 బ్యాలెన్స్ ప్రీమియంలో 5%) చెల్లించాలి.

- స్మార్ట్క్యాష్బెనిఫిట్: ప్రభుత్వఆసుపత్రిలోఉచితంగాచికిత్సపొందాలనుకున్నప్పుడుకూడాఈప్లాన్వినియోగదారునికి ఏదైనాఅందిస్తుంది. వినియోగదారుడు ప్రైవేట్ఆసుపత్రికి వెళ్లకూడదని నిర్ణయించుకుని, తమ చికిత్స కోసం ‘రైజ్’ పాలసీ కింద క్లెయిమ్ చేయకపోతే, వారు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమ్మరీని సమర్పించిన తర్వాత, తమ చికిత్స తర్వాత ఖర్చులను నిర్వహించుకునేందుకు నివా బుపా నుంచి ₹5,000 హామీ నగదు చెల్లింపును క్లెయిమ్ చేయవచ్చు.
- రిటర్న్ బెనిఫిట్: ‘రైజ్’తో ప్రవేశపెట్టబడుతున్న మరో పరిశ్రమ-మొదటి ఫీచర్ ఏమిటంటే, వినియోగదారుడు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 50% బీమా చేయబడిన మొత్తం, బీమా చేయబడిన బేస్ మొత్తం కన్నా ఎక్కువగా తిరిగి ఇస్తుంది. కనుక, రూ.10,000 ప్రీమియం కోసం రూ.5,000 అదనపు బీమా మొత్తంగా వినియోగదారుకు తిరిగి ఇవ్వబడుతుంది. ఈ మొత్తం జీవితాంతం జమ అవుతుంది. ప్రతి ఏడాది సేకరించిన మొత్తంపై 10% బోనస్ జోడించబడుతుంది. ఈ ‘రిటర్న్’బీమా మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ లేదా మినహాయింపు వర్తించదు.
ఈ ప్రయోజనాలతో పాటు, ఈ ఉత్పత్తి 16 స్థానిక భాషలలో అపరిమిత డిజిటల్ సంప్రదింపులను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా, అపరిమిత సమయాల్లో జనరల్ ప్రాక్టీషనర్లతో సంప్రదించవచ్చు. ఇప్పుడు ‘రైజ్’ అనేక ఐచ్ఛిక ప్రయోజనాలతో వస్తుంది. ఇది వినియోగదారులు తమ గది రకం కేటగిరీని సవరించేందుకు, ఆధునిక చికిత్సపై రూ.50,000 పరిమితిని తొలగించేందుకు, బీమా చేయబడిన ప్రాథమిక మొత్తానికి పరిమితిని పెంచడానికి ఎంపికను అందిస్తుంది.
రైజ్ అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలోనివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్- అండర్ రైటింగ్, ప్రొడక్ట్స్ అండ్ క్లెయిమ్స్ డాక్టర్ భబతోష్ మిశ్రామాట్లాడుతూ, “నివా బుపాలో, మా వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే వినూత్న పరిష్కారాలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. భారతదేశంలోని మిస్సింగ్ మిడిల్ కోసం బీమా అంతరాన్ని తగ్గించడంలో రైజ్ ఒక ముందడుగు మాత్రమే కాదు, 2047 నాటికి అందరికీ బీమా అనే IRDAI దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. ఈ పథకం ఆరోగ్య బీమా సరసమైనది, సరళమైనది.మన పేద జనాభా అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. వ్యక్తులు, కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ ,ఆర్థిక భద్రతను పొందేలా చేస్తుంది’’ అని వివరించారు.

రైజ్ అనేది సరసమైన ఆరోగ్య బీమా పథకం. ఇది 2+ గంటల ఆసుపత్రిలో చేరడం, నివాస, గృహ సంరక్షణ చికిత్స అవసరమయ్యే అన్ని చికిత్సలకు కవరేజ్‌తో పాటు 60 రోజుల ముందు,180 రోజుల తర్వాత ఆసుపత్రిలో చేరే ఖర్చులతో సహా సమగ్ర శ్రేణి ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది.
ఈ ప్లాన్‌లు వ్యక్తిగత, బహుళ-సభ్యులు,కుటుంబ ఫ్లోటర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. రూ.10 లక్షల బీమా మొత్తానికి 35 సంవత్సరాల వ్యక్తికి రూ.6,416 నుంచి రూ.8,669 వరకు జోన్ వారీగా ధరలను కలిగి ఉంటాయి.
| కవరేజ్ రకం | జోన్ 1 | జోన్ 2 | జోన్ 3 | జోన్ 4 |
| స్వయంగా 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తికి మాత్రమే | 8,669 | 7,802 | 7,802 | 6,416 |
| 35 మరియు 32 సంవత్సరాల వయస్సు గల వ్యక్తికి,జీవిత భాగస్వామి కోసం వ్యక్తిగత పాలసీ | 15,605 | 14,044 | 14,044 | 11,546 |
| పెద్ద సభ్యుని వయస్సు 35 సంవత్సరాలు కలిగిన ఫ్లోటర్ పాలసీ(2A) | 14,375 | 12,937 | 12,937 | 10,637 |
| పెద్ద సభ్యుని వయస్సు 35 సంవత్సరాలు కలిగిన ఫ్లోటర్ పాలసీ (2A1C) | 18,222 | 16,400 | 16,400 | 13,484 |
గమనిక: చూపబడిన అన్ని ప్రీమియంలు రూ.10 లక్షల బీమా మొత్తానికి మరియు 18% జీఎస్‌టీతో కలిపి.
నివా బుపా ఆరోగ్య బీమాను గతంలో కన్నా మరింత సరళంగా, రివార్డింగ్‌గా‘రైజ్’అందుబాటులోకి తెస్తోంది. ప్రతి భారతీయుడు ఆర్థిక ఒత్తిడి లేకుండా ఉత్తమ ఆరోగ్య సంరక్షణను పొందే విశ్వాసం కలిగి ఉండేలా చూస్తోంది.