గొల్లప్రోలులో నూతన అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగబాబు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గొల్లప్రోలు, ఏప్రిల్ 4,2025: పిఠాపురం శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు తన పదవిలోకి వచ్చిన అనంతరం తొలిసారి నియోజకవర్గాన్ని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గొల్లప్రోలు, ఏప్రిల్ 4,2025: పిఠాపురం శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు తన పదవిలోకి వచ్చిన అనంతరం తొలిసారి నియోజకవర్గాన్ని సందర్శించారు. శుక్రవారం ఉదయం ఆయన గొల్లప్రోలు పట్టణంలో రూ.88.98 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన యూపీహెచ్సీ (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను హరిప్రసాద్ ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అనంతరం అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కేంద్ర ప్రాంగణాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About Author