రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసిన మంత్రి నారా లోకేశ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఫిబ్రవరి 5,2025: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,ఫిబ్రవరి 5,2025: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రమంత్రిని అభ్యర్థించారు.
డిఫెన్స్ రంగంలో పరికరాల తయారీ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పలు యూనిట్లు ఏపీలో స్థాపించేందుకు సహకరించాలని కోరారు.

అంతేకాదు, కేంద్రం అందిస్తున్న మద్దతుతో అమరావతి రాజధాని పనులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి కేంద్ర సహాయంతో ఊపిరిపోస్తోందని, అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం తమవంతు సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.