క్యాంపస్ యాక్టివ్‌వేర్‌కు కొత్త ప్రచారకర్తగా కృతి సనన్..
వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 31, 2025 : ప్రముఖ స్పోర్ట్స్, అథ్లెజర్ ఫుట్‌వేర్ బ్రాండ్ క్యాంపస్ యాక్టివ్‌వేర్ తమ మహిళా విభాగానికి జాతీయ అవార్డు విజేత నటి కృతి

వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 31, 2025 : ప్రముఖ స్పోర్ట్స్, అథ్లెజర్ ఫుట్‌వేర్ బ్రాండ్ క్యాంపస్ యాక్టివ్‌వేర్ తమ మహిళా విభాగానికి జాతీయ అవార్డు విజేత నటి కృతి సనన్‌ను కొత్త ప్రచారకర్తగా నియమించుకుంది.
ఈ భాగస్వామ్యం బ్రాండ్ వృద్ధి లక్ష్యాలను, ముఖ్యంగా భారతదేశంలో మహిళల పాదరక్షల విభాగంలో దాని స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది.
ఈ సందర్భంగా క్యాంపస్ యాక్టివ్‌వేర్ లిమిటెడ్ సీఈఓ నిఖిల్ అగర్వాల్ మాట్లాడుతూ, “క్యాంపస్ మహిళా విభాగానికి కృతి సనన్‌ను స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆమె లక్ష్యం, బహుముఖ ప్రజ్ఞ, ప్రామాణికత నేటి భారతీయ మహిళల ఆశయాలను ప్రతిబింబిస్తాయి.
మహిళల స్పోర్ట్స్, అథ్లెజర్ విభాగం మాకు అత్యంత ముఖ్యమైన వృద్ధి చోదకాల్లో ఒకటిగా మారింది. మా డిజైన్‌లను మెరుగుపరచడం, మహిళల అభిరుచులకు తగిన ఆవిష్కరణలను చేయడం ద్వారా ఈ విభాగంలో క్యాంపస్ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేస్తాం” అని అన్నారు.

కృతి సనన్ తన భావాలను పంచుకుంటూ, “నా దృష్టిలో, శైలి అనేది మీరు ఎవరో ప్రతిబింబించాలి. క్యాంపస్ అనేది నా నమ్మకాలకు అద్దం పట్టే ఒక ఐకానిక్ స్వదేశీ స్నీకర్ బ్రాండ్.
క్యాంపస్ కుటుంబంలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా క్యాంపస్ యాక్టివ్‌వేర్ మహిళా వినియోగదారుల బ్రాండ్ ఇమేజ్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.