కిస్నా డైమండ్ & జ్యూయలరీ: #అబ్ కిబార్ఆప్కే_లియే క్యాంపెయిన్ గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగింపు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 20, 2025: భారతదేశంలోని ప్రముఖ డైమండ్ ,జ్యూయలరీ రిటైల్ చెయిన్ అయిన కిస్నా డైమండ్ అండ్ జ్యూయలరీ తమ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 20, 2025: భారతదేశంలోని ప్రముఖ డైమండ్ ,జ్యూయలరీ రిటైల్ చెయిన్ అయిన కిస్నా డైమండ్ అండ్ జ్యూయలరీ తమ వినియోగదారులను ఆకర్షించడంలో మరో భారీ విజయాన్ని సాధించింది.
వినియోగదారుల కోసం రూపొందించిన #అబ్ కిబార్ఆప్కే_లియే క్యాంపెయిన్, గ్రాండ్ ఫినాలేలో భాగంగా 100 మారుతి సెలెరియో కార్లను అదృష్టవంతులైన కస్టమర్లకు బహుమతిగా అందజేసింది.
ఈ క్యాంపెయిన్‌లో 51,219 మంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2024న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 18, 2025న ముగిసింది. రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన వజ్రం, ప్లాటినం, సాలిటైర్ ఆభరణాలు లేదా రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశాన్ని కిస్నా అందించింది.

విజేతలకు పురస్కారాలు
గ్రాండ్ ఫినాలేలో 11 నగరాల్లో ఒకేసారి కార్లను అందజేశారు. ఉత్తర భారతదేశం నుండి అత్యధికంగా 20,795 మంది పాల్గొనగా, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి వేదికలయ్యాయి. ఈ విజేతలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మారుతి సెలెరియో కార్ల కీలను అందించారు.
హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ,
“#అబ్ కిబార్ఆప్కే_లియే మా కస్టమర్లపై ఉన్న నమ్మకానికి ప్రతీక. ఈ కార్యక్రమం ద్వారా మాకు వినియోగదారుల నుంచి లభించిన ప్రోత్సాహం విశేషమైనది. భవిష్యత్తులో మరింత అధ్బుతమైన కార్యక్రమాలను రూపొందిస్తాం” అని అన్నారు.
కిస్నా డైరెక్టర్ పరాగ్ షా మాట్లాడుతూ,
“ఈ క్యాంపెయిన్ వినియోగదారులతో మాకు ఉన్న అనుబంధాన్ని మరింతగా బలపరిచింది. ఇది సంప్రదాయం, ఆధునికత, నమ్మకాన్ని మిళితం చేస్తూ ఆభరణాల ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపిస్తుంది” అని పేర్కొన్నారు.
విజేతలకు టెలికాల్స్ ద్వారా సమాచారాన్ని ముందుగానే అందించడంతో వారి ఆనందం రెట్టింపు అయింది. మారుమూల ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు పాల్గొనే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

కిస్నా అందించిన ఈ అద్భుతమైన అవకాశం కస్టమర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కిస్నా తన వినియోగదారులకు విలువను అందించడంలో ఎప్పుడూ ముందంజలో ఉందని ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేసింది.
అబ్ కిబార్ఆప్కే_లియే క్యాంపెయిన్ ద్వారా, కిస్నా వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించింది.