EV ఫైనాన్సింగ్ కోసం కోటక్ మహీంద్రా ప్రైమ్‌తో భాగస్వామ్యం చేసుకున్న JSW MG మోటార్ ఇండియా
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్, జనవరి15, 2025: JSW MG మోటార్ ఇండియా తన వినూత్న Battery-As-A-Service (BaaS) ప్రోగ్రామ్ కోసం వినియోగదారులకు ప్రత్యేక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్, జనవరి15, 2025: JSW MG మోటార్ ఇండియా తన వినూత్న Battery-As-A-Service (BaaS) ప్రోగ్రామ్ కోసం వినియోగదారులకు ప్రత్యేక ఫైనాన్సింగ్ సౌకర్యాలను అందించేందుకు కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ (KMPL)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఈ భాగస్వామ్యంతో, కోటక్ మహీంద్రా ప్రైమ్, BaaS కాన్సెప్ట్‌కు మద్దతు ఇచ్చిన మొదటి ప్రీమియర్ ఆటో ఫైనాన్సర్‌గా మారింది. దీని ద్వారా EV యాజమాన్యాన్ని మరింత సులభతరం చేసి, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు వీలైంది.
BaaS ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2024లో ప్రారంభమైంది. ఇది వినియోగదారులకు ప్రారంభ పెట్టుబడి ఖర్చులను తగ్గించడంతో పాటు సజావుగా యాజమాన్యాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రారంభం నుంచి, EVల పట్ల వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది, తద్వారా అమ్మకాల్లో కూడా వృద్ధి కనిపించింది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, KMPL ఇప్పుడు ఈ BaaS యాజమాన్య నమూనాలో చేరి, కస్టమర్ల కోసం మరిన్ని అనుకూలమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా JSW MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మిస్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ,
“ఆవిష్కరణల పట్ల మా నిబద్ధత బలంగా కొనసాగుతోంది. వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించేందుకు మేము ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాము. BaaS ప్రోగ్రామ్‌తో, ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త మైలురాయి చేరుకున్నాము. ప్రముఖ ఫైనాన్షియల్ భాగస్వాములతో కలిసి, ఈ ప్రోగ్రామ్ పరిధిని మరింత విస్తరించడం ద్వారా EV స్వీకరణను వేగవంతం చేయడం మా లక్ష్యం. మా ప్రోగ్రామ్‌ను మద్దతు ఇస్తూ ఈ ప్రయాణంలో భాగస్వామిగా ఉన్న KMPLకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
కోటక్ మహీంద్రా ప్రైమ్ మ్యానేజింగ్ డైరెక్టర్, CEO మిస్టర్ వ్యోమేష్ కపాసి మాట్లాడుతూ,
“KMPLలో, మేము వాహన ఫైనాన్సింగ్‌లో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. JSW MG మోటార్ ఇండియా ,BaaS ప్రోగ్రామ్‌లో భాగస్వామిగా ఉండటం మాకు గర్వకారణం. ఈ భాగస్వామ్యం ద్వారా, EVల కోసం మరిన్ని కస్టమర్ ఫ్రెండ్లీ ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించి, భారతదేశ EV పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాము” అని అన్నారు.
BaaS ప్రోగ్రామ్లో భాగంగా, MG మోటార్ బ్యాటరీ ధరను వాహన బాడీ షెల్ నుండి విభజించి, వినియోగదారులకు ప్రత్యేకంగా బాడీ షెల్ లేదా బ్యాటరీ కోసం ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తోంది. ఇది వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా ,చవకగా అందుకునే అవకాశాన్ని పెంచింది.

2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి JSW MG మోటార్తో KMPL గట్టి వ్యాపార సంబంధాలను కలిగి ఉంది. రిటైల్ , ఛానెల్ ఫైనాన్స్‌లో కస్టమర్లకు మెరుగైన సేవలను అందించేందుకు రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.
ఈ భాగస్వామ్యం ద్వారా, భారతదేశంలో EV యాజమాన్యానికి కొత్త దిశను చూపించేందుకు JSW MG మోటార్ ఇండియా ముందడుగు వేస్తోంది.