“రైతు ద్రోహి జగన్.. మిర్చి రైతులపై మోసపు నాటకం: మంత్రి సవిత”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, ఫిబ్రవరి 19,2025: రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, ఫిబ్రవరి 19,2025: రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో రైతులను ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు మునిగిపోతున్న తన పార్టీని కాపాడుకోవడానికి మిర్చి రైతుల పరామర్శ పేరుతో కొత్త డ్రామా ప్రారంభించారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి.2024లో అత్యధిక ESG రేటింగ్ సాధించిన వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్
ఇది కూడా చదవండి..నథింగ్ ఫోన్ (3a) సిరీస్: విప్లవాత్మక కెమెరా ఫీచర్లతో మార్చి 4న ఆవిష్కరణ
ఇది కూడా చదవండి..తిరుపతిలో ITCX 2025: దేవాలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యతపై అన్నామలై ప్రసంగం
బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ, జగన్ మోసపూరిత పాలన వల్ల గత ఐదేళ్లలో ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ధాన్యం బకాయిలను చెల్లించకుండా మొహం చాటేశారని ధ్వజమెత్తారు.

ఎన్డీయే ప్రభుత్వంలో రైతుల ధాన్యం బకాయిల క్లియర్
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించారని మంత్రి తెలిపారు. వైసీపీ హయాంలో మిర్చి కనీస ధర రూ.7,000గా నిర్ణయించగా, అప్పట్లోనే రైతులు తీవ్ర ఆందోళనకు దిగినా జగన్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. చివరకు మార్కెట్లో మిర్చి ధరలు పడిపోయినా, కొనుగోలు చర్యలు తీసుకోకపోవడం రైతులను మరింత కష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు.
ఇది కూడా చదవండి..లయన్స్‌గేట్ ప్లేలో సౌత్ ఇండియన్ థ్రిల్లర్ ‘దక్షిణ’ ఫిబ్రవరి 21న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధం
ఇది కూడా చదవండి..మహా కుంభమేళా లో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం – సనాతన ధర్మం వికాసం పై ప్రసంగం
Read this also...“Lionsgate Play Premieres Telugu Crime Thriller ‘Dhakshina’ on February 21”
Read this also...The Hype Begins: Zee Studios & Prerna V Arora’s Pan-India Film “Jatadhara” Featuring Sudheer Babu Commences Shooting in Hyderabad
రైతు వ్యతిరేక వైఖరి, పాలనా వైఫల్యాల కారణంగా ప్రజలు జగన్‌ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని మంత్రి పేర్కొన్నారు. జగన్ అసమర్థతను గ్రహించిన వైసీపీ నేతలే ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో జగన్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉండగా, జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కి వెళ్లి నానా హంగామా సృష్టించారని మంత్రి సవిత విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్కచేయకుండా నియంతలా వ్యవహరించడం ప్రజాస్వామ్యంపై, చట్టాలపై ఆయనకు గౌరవం లేదని మరోసారి స్పష్టమైనట్లు పేర్కొన్నారు.