విద్యార్థులను పేరు పేరునా పలుకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ డిసెంబర్ 7,2024: విద్యార్థులను పేరు పేరునా పలకరిస్తూ.. పరిచయం చేసుకుంటూ.. ప్రతి ఒక్కరికీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ డిసెంబర్ 7,2024: విద్యార్థులను పేరు పేరునా పలకరిస్తూ.. పరిచయం చేసుకుంటూ.. ప్రతి ఒక్కరికీ కరచాలనం చేస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. చిన్నారుల కోరిక మేరకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చి ఉత్సాహపరుస్తూ… చాక్లెట్లు పంచుతూ.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొన్నారు.

మూడు తరగతి గదుల్లో సుమారు వంద మందికి పైగా విద్యార్థులు, విద్యార్థినిలతో మమేకం అయ్యారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిమిత్తం కడప మున్సిపల్ హై స్కూల్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ పోలీసు వందనం స్వీకరించిన అనంతరం పాఠశాల విద్యార్థులు స్కూల్ బ్యాండ్ తో ఘన స్వాగతం పలికారు.

నేరుగా ఆరో తరగతి క్లాసులో అడుగు పెట్టారు. మౌనిక అనే విద్యార్థిని స్వహస్తాలతో గీసిన పవన్ కళ్యాణ్ చిత్రాన్ని స్వీకరించారు. చిన్నారుల వద్దకు వెళ్లి అందరి పేర్లు తెలుసుకుంటూ వారికి కరచాలనం చేస్తూ ఉత్తేజపరిచారు. శివ మాల ధరించిన విద్యార్థితో ముచ్చటించి దీక్ష వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం 8వ తరగతి క్లాసులోకి వెళ్లారు. అక్కడ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. 10వ తరగతి విద్యార్థులు రూపొందించిన రైల్వే రోప్ ఎలివేటర్ నమూనాను పరిశీలించారు. ఆ ప్రయోగాన్ని నిశితంగా పరిశీలించి అభినందనలు తెలియజేశారు. అనంత

రం 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖీలో పాల్గొన్నారు.

రెజ్లింగ్లో జాతీయ స్థాయిలో పతకం సాధించిన వెంకటలక్ష్మి అనే విద్యార్థినిని అభినందించారు. క్రీడల్లో కడప మున్సిపల్ హైస్కూలు విద్యార్ధులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విషయం తెలుసుకుని వ్యాయామ ఉపాధ్యాయుడికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా స్కూల్ క్రికెట్ టీమ్ కి చెందిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు పవన్ కళ్యాణ్ ఎదుట ఉంచారు. అనంతరం పాఠశాలలో స్కూల్ టీచర్స్, విద్యార్థినులు తీర్చిదిద్దిన రంగవల్లలు తిలకించారు. ముగ్గులు ఎవరు వేశారు, ఏ థీమ్ తో వేశారు అనే విషయాలు తెలుసుకుని వారితో ఫోటోలు దిగారు.

నేలపై కూర్చుని.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేసి..
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు తీరుని పరిశీలించారు. విద్యార్థులతోపాటు నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తున్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు.

వాగ్దేవి పూజతో కార్యక్రమానికి శ్రీకారం
టీచర్, పేరెంట్స్ మెగా మీట్ నిమిత్తం మున్సిపల్ హైస్కూలులో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ చదువుల తల్లి సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హైస్కూలు ప్రాంగణంలోని అమ్మవారి విగ్రహానికి పూల మాల సమర్పించి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా అనే మూల మంత్ర పఠనంతో అమ్మవారిని పూజించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీని తిలకించారు.

కడప మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు వేతనాలు పెంచాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

About Author