ఎలక్ట్రిక్ బ్యాటరీ డెడ్ అయిందని ఎలా తెలుసుకోవచ్చు..?

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ఆగస్టు 9, 2023: కారు నుంచి బైక్స్ ,స్కూటర్లు తోపాటు అన్ని ఎలక్ట్రిక్ వాహానాలకు బ్యాటరీ చాలా అవసరం. కానీ చాలా సార్లు బ్యాటరీ అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తుంది. కారు స్టార్ట్ కానప్పుడు ఇది గుర్తించాలి.
అసలు ఈవీ బ్యాటరీ జీవితకాలం ఎంత.. ? బ్యాటరీ డెడ్ అయిందని ఎలా తెలుసుకోవాలి..? బ్యాటరీకి ఎంత లైఫ్ ఉంది..? అది పాడయ్యే ముందు ఎలా తెలుస్తుంది..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాటరీ ఎంత కాలం ఉంటుంది..
కారు బ్యాటరీ లైఫ్ టైమ్ 4 నుంచి5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఎక్కువకాలం కారు పార్క్ చేస్తే బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. రోజుకు కనీసం రెండు సార్లు కారుని స్టార్ట్ చేసి సుమారు గంటసేపు కారు నడిపితే బ్యాటరీ 4 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేస్తుంది.

బ్యాటరీ మంచిది కాదని ఎలా తెలుస్తుంది..?
బ్యాటరీ చెడిపోయే ముందు, దాని వోల్టేజ్లో తేడా వస్తుంది. మీరు డ్యాష్‌బోర్డ్‌లో బ్యాటరీని గుర్తిస్తే… బ్యాటరీ వెంటనే మార్చాలి.. లేకుంటే అది ఎప్పుడైనా చెడిపోయే ప్రమాదం ఉంది.
కొన్నిసార్లు బ్యాటరీని గుర్తించలేని పరిస్థితి తలెత్తవచ్చు. అది ఒక్కోసారి అకస్మాత్తుగా చెడిపోతుంది. బ్యాటరీ 4 సంవత్సరాలు పూర్తయ్యేలోపు, దానిని మెకానిక్ ద్వారా తనిఖీ చేయించాలి, దాని ప్లేట్లను పరీక్షించాల్సినవసరం ఉంటుంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎంత కాలం ఉంటుందో ముందుగానే తెలుస్తుంది. https://afdc.energy.gov/vehicles/electric_batteries.html