సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” పోస్టర్ లాంచ్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ఆగస్టు 9, 2023: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమాలో మాస్ రోల్లో కనిపించనున్నారు. కుటుంబ అంశాలతో కూడిన యాక్షన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ఆగస్టు 9, 2023: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమాలో మాస్ రోల్లో కనిపించనున్నారు. కుటుంబ అంశాలతో కూడిన యాక్షన్ డ్రామా చిత్రం ఇది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

Source from Twitter

ఈరోజు సూపర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ బాబు స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. మాస్ లుక్ లో సిగరెట్ తాగుతున్న మహేష్ పోస్టర్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. మహేష్ బాబు మాస్ పాత్రలో నటించడంతో అభిమానుల్లో అవధులు లేని ఉత్సాహంకనిపిస్తోంది.

మరో కీలకమైన అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగానే విడుదలకానుంది. 12 జనవరి 2024న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఎటువంటి సందేహం లేకుండా, గుంటూరు కారం ఓవర్సీస్తోపాటు దేశీయ మార్కెట్‌లలో బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా ఒక కథానాయికగా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంగీత దర్శకుడిగా థమన్‌ని ఎంచుకున్నాడు.

About Author