ఎక్స్ పర్ట్ ఏసీ సొల్యూషన్స్ తో ఒప్పందం చేసుకున్న హైకావా అప్లయెన్సెస్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2023: ఎయిర్ కండిషనింగ్, గృహోపకరణాల తయారీ సంస్థ జపాన్ దిగ్గజం హైకావా అప్లయెన్సెస్, నేషనల్ ఎయిర్ కాన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2023: ఎయిర్ కండిషనింగ్, గృహోపకరణాల తయారీ సంస్థ జపాన్ దిగ్గజం హైకావా అప్లయెన్సెస్, నేషనల్ ఎయిర్ కాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ అయిన హైదరాబాద్‌కు చెందిన ఎక్స్ పర్ట్ ఏసీ సొల్యూషన్స్ తో చేతులు కలిపింది.
మహారాష్ట్రలోని ముంబై, సిల్వాసా, దాద్రా నగర్ హవేలిలలో కార్యాలయాలున్న హైకావా.. అత్యధిక సామర్థ్యం, విద్యుత్ పొదుపు, సౌఖ్యం, పర్యావరణ అనుకూలంగా ఉండే ఉత్పత్తులకు పేరెన్నిక గన్నది. తమ ఉత్పత్తులను మరింతమందికి అందించడానికి ఈ భాగస్వామ్యం వారికి కూడా గేమ్‌ఛేంజర్ అవుతుంది.

దక్షిణ భారతదేశంలో హైదరాబాద్‌కు చెందిన ఎక్స్ పర్ట్ ఏసీ సొల్యూషన్స్ అధికారిక భాగస్వామిగా హైకావా అప్లయెన్సెస్ ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ వినియోగదారులకు చేరుతాయి.
ఎక్స్ పర్ట్ ఏసీ సొల్యూషన్స్ సంస్థ..హెచ్‌వీఏసీ, రూమ్ ఎయిర్ కండిషనర్ (ఆర్ఏసీ) విభాగాల్లో సరఫరా, ఇన్ స్టలేషన్, టెస్టింగ్, కమిషన్, మెయింటెనెన్స్ లాంటి సేవలకు వన్ స్టాప్ సొల్యూషన్ ప్రొవైడర్ గా గుర్తింపు పొందింది. గత నాలుగు సంవత్సరాల్లో 7వేలకు పైగా యూనిట్లను విక్రయించింది.
ఈ సందర్భంగా నేషనల్ ఎయిర్ కాన్ ఎండీ షాముద్దీన్ మాట్లాడుతూ, “జపనీస్ మల్టీ బ్రాండ్ హైకావా అప్లయెన్సెస్ తో చేతులు కలపడం మాకు గర్వంగా సంతోషంగా ఉంది.
“మా విస్తారమైన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నెట్ వర్క్ ద్వారా అమ్మకాలను పెంచుకుంటామని మేము విశ్వసిస్తున్నాము. దక్షిణ భారతదేశంలోని హైకావా వినియోగదారులకు ఇప్పుడు కస్టమర్ సర్వీస్, శ్రేష్ఠత పట్ల నిబద్ధత లాంటివి మరింతగా అందుతాయి” ఆయన అని చెప్పారు.

దక్షిణ భారతదేశంలో తమ వినియోగదారుల పరిధిని పెంచడానికి ఎక్స్ పర్ట్ ఏసీ సొల్యూషన్స్ తో చేతులు కలపడం పట్ల తన సంతోషాన్ని పంచుకున్న హైకావా అప్లయెన్సెస్ సీఈఓ మక్బూల్ సూర్య మాట్లాడుతూ..“పెరుగుతున్న వినియోగదారు బ్రాండ్ గా, దక్షిణ భారతదేశంలో విస్తరించడానికి ఆసక్తిగా ఉన్నందున, ఎక్స్ పర్ట్ ఏసీ సొల్యూషన్స్ తో ఈ భాగస్వామ్యం సరైనది.
దక్షిణ భారతదేశంలోని వినియోగదారులకు ఎయిర్ కండిషనింగ్, గృహోపకరణాలలో మా అధునాతన సాంకేతికతను అందించడానికి మేము ఎదురుచూస్తున్నామని తెలిపారు.