బీజేపీ సీనియర్ నాయకుడు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2023: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2023: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ డివిజన్ లలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దగ్గరుండి ఓటు హక్కుకు నమోదు చేయించారు బుక్క వేణుగోపాల్.
ఈ ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా తరలి వచ్చి వాళ్లకి అందుబాటులో ఇంటి వద్దనే ఏర్పాటు చేసినందుకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2,3తేదీల్లోజరిగే ఈ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొనాలని అలాగే నియోజకవర్గంలో ఎవరైనా ఓటర్ నమోదు కావాలనుకునే వారు తనను సంప్రదిస్తే (9866191249)వారి ఇంటి వద్దకే సంబంధిత వ్యక్తులను పంపడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో-కన్వీనర్ మహాలింగం గౌడ్, బండ్లగూడ బిజెపి అధ్యక్షులు మహేష్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు బుక్క కృష్ణ, నరేష్ యాదవ్ , బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.