తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన దివ్యాంగుడు గంగాధర్ స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 4,2024: కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్‌ను కలుద్దాం. అతను ధైర్యం,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 4,2024: కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్‌ను కలుద్దాం. అతను ధైర్యం, నాయకత్వం, సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు.

దృష్టి లోపం ఉన్న గంగాధర్ తన జీవితాన్ని తన సమాజానికి, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సంఘాలకు సహాయం చేయడానికి అంకితం చేశాడు.

ఆయన శారీరక వైకల్యం ఉన్న శ్రీమతి నూకరత్నంను వివాహం చేసుకున్నారు, వారు ప్రభుత్వ దివ్యాంగుల పింఛను, అతని తల్లిదండ్రుల సహాయంతో తమ కుటుంబఖర్చులను వెళ్లదీస్తున్నారు.

2013 నుంచి రిలయన్స్ ఫౌండేషన్‌తో లబ్ది పొందుతున్న గంగాధర్, ఈ ఫౌండేషన్ హెల్ప్‌లైన్, వాయిస్ మెసేజ్‌లను ఉపయోగించి వాతావరణ హెచ్చరికలు, అల్లకల్లోలమైన సముద్రజలాలు, చేపలు బాగా లభ్యమయ్యే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు.

ఆయన ఈ ముఖ్యమైన సమాచారాన్ని స్థానిక మత్స్యకార సంఘాలతో పంచుకుంటాడు. తద్వారా వారు సురక్షితంగా ఉండటానికి, జీవనోపాధిని సంపాదించుకోవడానికి సహాయం చేస్తాడు.

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్,సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి భారతదేశ తీరప్రాంతంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమాచార మద్దతుతో భారతదేశ తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు చేపలవేట మరింత సురక్షితమైందిగా, సుస్థిరమైందిగా, లాభదాయకంగా ఉండేలా చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది.

గంగాధర్ మద్దతు అక్కడితో ఆగలేదు. బయోమెట్రిక్ కార్డ్‌ల పెన్షన్ దరఖాస్తులు నింపడంలో సాయం చేస్తాడు. అర్హత లు ఉన్నప్పటికీ ఆయా పథకాలు పొందలేకపోయిన వారి సమస్యలను పరిష్కరించడంలో అతను తన సంఘానికి సహాయం చేస్తాడు.

అంతేగాకుండా, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రభుత్వ రాయితీల కోసం దరఖాస్తు చేసు కోవడానికి మత్స్యకార సంఘంలోని యువకులకు మార్గనిర్దేశం చేస్తాడు.

అంకితభావం, కృషి, గంగాధర్ తన కమ్యూనిటీకి అనేక విధాలుగా సహాయం చేస్తున్న తీరు, ఒక వ్యక్తి సవాళ్లను ఎలా అధిగమించగలడు, ప్రపంచంలో ఎలా మార్పు తీసుకురాగలడనే దానిపై అందరికీ స్ఫూర్తినిస్తుంది.

గంగాధర్ కథ సంకల్పం, దయ శక్తిని గుర్తు చేస్తుంది, నిజమైన ‘దృష్టి’ హృదయం నుంచి వస్తుందని రుజువు చేస్తుంది, అది చూపును మించిన దృష్టి.

దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి ,వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తాం.

రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో దివ్యాంగుల ఏకీకరణ మొదలుకొని వారు పొందగలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి కూడా ఇది ప్రయత్నిస్తుంది.

2024 లో ఈ దినోత్సవం థీమ్ సమగ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం.

About Author