సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం… పవన్ కుమారుడు ఆసుపత్రిలో
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
స్కూల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించగా, మూడవ అంతస్తులో ఉన్న మార్క్ శంకర్‌కి చేతులు, కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. పొగ మోతాదుగా పీల్చిన కారణంగా శ్వాస తీసుకోవడంలో కూడా కొంత ఇబ్బంది ఎదురైనట్టు సమాచారం. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read this also…Pawan Kalyan Orders Probe Over Alleged Traffic Delay for JEE Students
ఇది కూడా చదవండి...పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: జగన్

ఈ విషయం తెలియగానే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌కు పార్టీ నేతలు, అధికారులు సింగపూర్ వెళ్లాలని సూచించారు.
ఇది కూడా చదవండి...పవన్ కుమారుడి గాయాలపై సీఎం చంద్రబాబు, కేటీఆర్ ట్వీట్లు
Read this also…Pawan Kalyan’s Son Mark Shankar Injured in Fire Accident in Singapore
అయితే, అరకులోని కురిడి గ్రామం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాల్సిందిగా భావించిన ఆయన, అక్కడి సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాన్ని సందర్శిస్తానని స్పష్టం చేశారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, విశాఖ చేరుకుని అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.