ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించిన ‘మ్యాజిక్ డ్రెయిన్’..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏలూరు, నవంబర్ 25,2025: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ద్వారకా తిరుమల మండలం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏలూరు, నవంబర్ 25,2025: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామంలో నిర్మించిన నూతన ‘మ్యాజిక్ డ్రెయిన్’ను మంగళవారం పరిశీలించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కేవలం రూ.77,173 ఖర్చుతో మూడు రోజుల్లోనే పూర్తయిన ఈ డ్రెయిన్‌ను ఉప ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి, నిర్మాణ వివరాలు, పొరల సంఖ్య, లోతు, ఫిల్టర్ వ్యవస్థ తదితర అంశాలపై అధికారులను ప్రశ్నించారు. ఆనుకొని ఉన్న ఇంటి నుంచి ఒక బిందె నీటిని వంపి డ్రెయిన్ పనితీరును నేరుగా తనిఖీ చేశారు.

పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో మురుగునీటి సమస్యను స్థిరంగా పరిష్కరించేందుకు తీసుకొచ్చిన ఈ ‘మ్యాజిక్ డ్రెయిన్’ వ్యవస్థ పనితీరుపై పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈ విధానాన్ని అన్ని గ్రామాల్లో అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
మ్యాజిక్ డ్రెయిన్ ప్రత్యేకతలు
- సాంప్రదాయ సిమెంట్ డ్రెయిన్ (1 కి.మీ.) ఖర్చు: ₹50 లక్షలు మ్యాజిక్ డ్రెయిన్ (1 కి.మీ.) ఖర్చు: కేవలం ₹7.5 లక్షలు మాత్రమే
- మూడు పొరల రాళ్ల ఫిల్టర్ వ్యవస్థ (3 sizes of stones)
- ప్రతి 50 మీటర్లకు ఒక సోక్ పిట్
- మురుగునీరు భూమిలో ఇంకిపోయి భూగర్భజలాల మట్టం పెరుగుతుంది
- దుర్వాసన, దోమలు, రోడ్లపై నీటి నిల్వ, కాలుష్యం పూర్తిగా తగ్గుతాయి
- భారీ వర్షాల్లో కూడా రోడ్లు ఎప్పుడూ ఆరుబయట

నందిగామలో తొలి పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 106 గ్రామాల్లో అమలు జరుగుతోంది. పుణ్యక్షేత్రంగా ప్రాధాన్యత ఉన్న ఐ.ఎస్. జగన్నాథపురంలో రెండో విడత పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ద్వారకా తిరుమల మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పథకం విస్తరణ జరుగుతోంది.
“చవకైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన పరిష్కారం” అంటూ ఉప ముఖ్యమంత్రి ఈ మ్యాజిక్ డ్రెయిన్ విధానాన్ని కొనియాడారు.