ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం వివాదంపై పూజా కార్యక్రమం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 24,2024:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 24,2024:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
దుర్గగుడిలో వెండి సింహాల వివాదం
దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైన ఘటనకు సంబంధించి వైసీపీ నాయకులు అప్పట్లో హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “హిందూ ధర్మాన్ని పాటించే వారే దుర్గగుడి సింహాలతో మేడలు కడతామా?” అని అన్నారు.
టిటిడి బోర్డు విషయమై పవన్ ఆగ్రహం
టిటిడి బోర్డులో జరిగిన తప్పులపై పవన్ కళ్యాణ్ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను ప్రశ్నిస్తూ, ధర్మాన్ని కాపాడే బాధ్యతను మరచారని విమర్శించారు. “జగన్ నియమించిన బోర్డులో తప్పు జరిగింది. ల్యాబ్ రిపోర్టులు బయటపడ్డా దబాయించారు,” అని అన్నారు.
సెక్యులరిజం పై వ్యాఖ్యలు
పవన్ మాట్లాడుతూ, “ఈ దేశంలో సెక్యులరిజం టూ వే గా ఉండాలి. ఇతర మతాలకు విఘాతం కలిగినప్పుడు ఎలా స్పందిస్తారో, హిందువుల ఆచారాలకు కూడా అలానే స్పందించాలి,” అన్నారు.
పంది కొవ్వు వివాదం
తిరుమల లడ్డూ విషయంలో హైకోర్టు ఏజీపీగా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. “పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేశారని అనడం సాటి హిందువుగా ఆయన ఎలా మాట్లాడతారు?” అని ప్రశ్నించారు.
సినీ పరిశ్రమకు విజ్ఞప్తి
సినీ పరిశ్రమలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ జోకులు వేయడం సరికాదని పవన్ అన్నారు. “సీరియస్ అంశాలను జోకులుగా తీసుకోవడం సరి కాదు,” అంటూ సినీ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేశారు.
సనాతన ధర్మ రక్షణపై పవన్ పట్టుదల
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ కోసం పోరాడతానని, భవిష్యత్తు తరాలకు ఈ ధర్మాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.