మనోజ్ కుమార్ మృతిపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 4,2025: ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ మృతి బాధాకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 4,2025: ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ మృతి బాధాకరమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ చిత్రసీమలో మనోజ్ కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని, దేశభక్తి, జాతీయ భావజాలం ప్రధానాంశాలుగా ఆయన చిత్రాలు తెరకెక్కించిన తీరును కొనియాడారు.

‘‘ఉపకార్’’ వంటి చిత్రంలో ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం ప్రేక్షకుల మనసులను హత్తుకుందని, ‘‘రోటీ కపడా ఔర్ మకాన్’’, ‘‘క్రాంతి’’ వంటి సినిమాలు అప్పటి సమాజ పరిస్థితులకు అద్దంపడతాయని అన్నారు. దేశాన్ని ప్రేమించే భావజాలంతో ఉన్న నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ గారి మరణం సినీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.