తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే కార్మికుల అభివృద్ధికి ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్ ప్రారంభించిన DBRC, టెట్రా ప్యాక్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, మార్చి 26, 2025:టెట్రా ప్యాక్ సహకారంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ( DBRC) “ఎన్ హేన్సింగ్ యాక్సెస్ టు ఎన్ టైటిల్మెంట్స్,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, మార్చి 26, 2025:టెట్రా ప్యాక్ సహకారంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ ( DBRC) “ఎన్ హేన్సింగ్ యాక్సెస్ టు ఎన్ టైటిల్మెంట్స్, లైవ్లీ హుడ్స్, హెల్త్ అండ్ ఎన్వైరన్ మెంటల్ సస్టైనబిలిటీ” ప్రాజెక్ట్ ను తిరుపతిలో ప్రారంభించింది. వ్యర్థాలు ఏరుకునే ప్రజల ఉన్నతి లక్ష్యంగా ప్రారంభించబడిన ఒక కొత్త కార్యక్రమం.
ఈ పనివారు నగర వ్యర్థాల నిర్వహణలో మరియు రీసైక్లింగ్ వ్యవస్థలో కీలకమైన బాధ్యతవహిస్తారు కానీ తరచుగా ఆర్థికపరమైన సమస్యలు, సాంఘిక మినహాయింపులను ఎదుర్కొంటున్నారు. అవసరమైన సేవలను పరిమితంగా మాత్రమే పొందుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ నాలుగు కీలకమైన స్తంభాల పై నిర్మించబడింది..
జీవనోపాధి పెంపుదల: వ్యర్థాలను ఏరుకునేవారి ప్రాథమిక జీవనోపాధిని శక్తివంతం చేయడానికి ట్రైసైకిల్స్ కేటాయించడం. ప్రత్యామ్నాయ ఆదాయం-ఉత్పన్నం చేసే కార్యకలాపాలను మద్దతు చేయడానికి పుష్ కార్ట్స్ కేటాయించడం, సంపాదనలు,సామర్థ్యాన్ని పెంచడం.
ఇది కూడా చదవండి…హైదరాబాద్ – సౌత్ ఆస్ట్రేలియా మధ్య బలపడుతున్న భాగస్వామ్యం..
Read this also…Hyderabad-South Australia Collaboration Strengthened During Premier’s Visit
పిల్లలకు విద్యాపరమైన మద్దతు: పిల్లలకు జీవన నైపుణ్యాలు కలిగించడం, సానుకూలమైన అలవాట్లు కలిగించడం,వారిని అధికారిక విద్యలోకి చేర్చుకోవడం వంటివి చేయడానికి అవుట్ డోర్ లెర్నింగ్ సెంటర్స్ (OLCలు)ను ఏర్పాటు చేయడం.

ఆరోగ్యం,సామాజిక భద్రత: ఆరోగ్య పద్ధతులను మెరుగుపరచడానికి చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం, ప్రభుత్వ హక్కులు పొందడానికి సమన్వయం చేయడం.
శిక్షణ,సామర్థ్యపు రూపకల్పన: వృత్తిపరమైన ఆరోగ్యంపై శిక్షణను అందించడం, సామాజిక భద్రతా పథకాలను అమలు చేయడం, నాయకత్వ నైపుణ్యాలు రూపొందించడం, వ్యర్థాలను వేరు చేసే ప్రయత్నాలను మెరుగుపరచడానికి పుష్ కార్ట్స్ ను మునిసిపల్ కార్పొరేషన్ కు అందించడం.
నవంబర్ 2024లో ఇది ఆరంభమైన నాటి నుంచి, ప్రాజెక్ట్ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. మూడు OLCలు ఏర్పాటు చేశారు ,సుమారు 90 మంది పిల్లలకు ప్రయోజనం కలుగుతోంది. అయిదు శిక్షణా సమావేశాలు నిర్వహించబడ్డాయి, మెరుగుపరచబడిన భద్రతా పద్ధతులు,నైపుణ్యాలతో 150 మంది వ్యర్థాలను ఏరుకునే పని వారికి సాధికారత కల్పించింది.
ట్రైసైకిల్స్,తోపుడు బంట్లను పంపిణీ చేయడం ద్వారా జీవనోపాధి మద్దతు కేటాయించింది, ఈ వర్గాలలో ఆర్థిక స్థిరత్వం శక్తివంతం చేసింది. బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికి పాఠశాలలు,కాలేజీలలో పారిశుద్ధ్య డ్రైవ్స్ సహా ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం,పర్యావరణ చైతన్యం పై చైతన్య కాంపైన్స్ ప్రారంభించబడ్డాయి.
ఇది కూడా చదవండి…ప్యూర్ సంస్థ నుంచి విప్లవాత్మక PuREPower ఉత్పత్తుల ఆవిష్కరణ..
Read this also…Laisha Utsav Celebrates Women’s Empowerment with Grandeur
మార్చి 26, 2025న మైలురాళ్ల సాధనలు
· తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కు తోపుడు బళ్లవిరాళం
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ వారికి 10 స్టీల్ తోపుడు బళ్లను విరాళంగా అందచేసిన ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. తోపుడు బళ్లను అందచేసిన కార్యక్రమానికి శ్రీ చరణ తేజ, అదనపు కమిషనర్ , అమరయ్య, డిప్యూటీ కమిషనర్ లు హాజరయ్యారు. నగర వ్యర్థాల నిర్వహణ మౌళిక సదుపాయాన్ని శక్తివంతం చేయడంలో కార్యక్రమం చేపట్టిన బాధ్యతను వారు ప్రశంశించారు.
“విద్య, జీవనోపాధి,సామాజిక మద్దతను మెరుగుపరచడమే కాకుండా, వ్యర్థాలను ఏరుకునే వారి – పర్యావరణ సుస్థిరత గుర్తింపు లేని ఈ ప్రజల అపురూపమైన తోడ్పాటును కూడా గుర్తించిన సమగ్రమైన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను DBRC,టెట్రా ప్యాక్ లను శ్లాఘిస్తున్నాను,” అని చరణ్ తేజ, అదనపు కమిషనర్ అన్నారు.
కార్యక్రమానికి శ్రీ. కమలేష్ ఖోలియా (సస్టైనబిలిటి మేనేజర్, టెట్రా ప్యాక్)శ్రీ. అల్లాడి దేవ కుమార్ (CEO, DBRC), సిహెచ్. శామ్యూల్ అనిల్ కుమార్ (డిప్యూటీ డైరెక్టర్ – ప్రోగ్రాంస్, DBRC)కూడా హాజరయ్యారు. ఈ నిబద్ధత దీర్ఘకాలం ప్రభావం చూపిస్తుందని వీరు పునరుద్ఘాటించారు.
· రీసైక్లింగ్ చైతన్యం కాంపైన్ ప్రారంభించడం

ఆ రోజు తదుపరి కార్యక్రమంగా, శ్రీ. ఖోలియా నగరమంతటా రీసైక్లింగ్ చైతన్యం కాంపైన్ ను యూత్ హాస్టల్, తిరుపతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం నగరంలో 21 ప్రాంతాల్లో విస్తరించింది, 10,000 మంది ప్రజలను చేరుకునే లక్ష్యాన్ని కలిగి ఉంది, బాధ్యతాయుతంగా వ్యర్థాలను పడవేయడం.పర్యావరణ సారధ్యం సంస్కృతిని ప్రోత్సహిస్తోంది.
· వ్యర్థాలను ఏరుకునే వారికి ట్రైసైకిల్స్ మరియు తోపుడు బళ్ల పంపిణీ
కొనసాగుతున్న జీవనోపాధి మద్దతులో భాగంగా, 23 ట్రైసైకిల్స్,తోపుడు బండ్లు వ్యర్థాలను ఏరుకునే వారికి పంపిణీ చేయబడి మొత్తం ఈ సంఖ్య 59కి చేరింది. వ్యర్థాలను ఏరుకునే వారి కుటుంబాలతో సామాజికంగా నిమగ్నమవడం
స్కేవెంజర్స్ కాలనీ మరియు గోవిందపురంలో వ్యర్థాలను ఏరుకునే కుటుంబాలతో ప్రాజెక్ట్ టీమ్ నేరుగా చర్చించింది, ఈ చొరవ హక్కులను , జీవనోపాధిని ఎలా మెరుగుపరిచింది, ఆరోగ్య అవగాహనను ఎలా పెంచింది అనే దాని పై నేరుగా అభిప్రాయాలను పొందింది.
తన అనుభవాన్ని తెలియచేస్తూ, శ్రీమతి, రాములమ్మ, ప్రాజెక్ట్ లబ్దిదారు, ఇలా అన్నారు: “నాకు ఫోర్ వీలర్ తోపుడు బండి ఇచ్చారు, దానితో నేను ఎండు చేపలు విక్రయించడం ప్రారంభించాను. ఇది నా ఆదాయాన్ని పెంచింది. మా జీవితాల్లో మార్పు తెచ్చిన DBRC,టెట్రా ప్యాక్ నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను.”
స్కేవెంజర్ కాలనీకి చెందిన మరొక లబ్దిదారు, కే. సుబ్రమణ్యం, ఇలా అన్నారు: “నేను రోజూ 5 కిలోమీటర్లు శ్రమిస్తాను, నా భుజాలు భారీ చెత్తా చెదారాల సంచులతో నొప్పి పెడుతున్నాయి, నా అయిదుగురు పిల్లల కోసం నేను కేవలం 200 నుంచి 250 రూపాయలు సంపాదిస్తున్నాను- ఇది ఒక నిరంతరమైన పోరాటం. ఇప్పుడు, DBRC,టెట్రా ప్యాక్ లు ఇచ్చిన ట్రైసైకిల్ రిక్షాతో, నేను 10 నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు, మరింత వ్యర్థాలు తీసుకువెళ్తున్నాను, రోజుకు 700 నుంచి 800 సంపాదిస్తున్నాను. నా కుటుంబ జీవితం ఇప్పుడు బాగుంది.ఈ అభివరృద్ధికరమై మార్పుకు నేను ఎంతో రుణపడి ఉంటాను.”
“తిరుపతిలో, టెట్రా ప్యాక్ తో మా భాగస్వామం జోక్యం కంటే అధికంగా ఉంది- వ్యర్థాలను ఏరుకునే వారికి ఇది ఒక వినూత్నమైన అవకాశం. ఆదాయాలను పెంచడం, మార్గాలను సృష్టించడం,తరతరాలుగా కొనసాగుతున్న అణిచివేతను తొలగించడం ద్వారా మేము భవిష్యత్తులను పునర్నిర్మిస్తున్నాం. ఈ పరివర్తనను సాధ్యం చేసిన టెట్రా ప్యాక్ కు కృతజ్ఞతలు” అని సిహెచ్. శామ్యూల్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, DBRC అన్నారు.

సామాజికంగా విలీనం చేయడం, ఆర్థిక సాధికారత,పర్యావరణ సుస్థిరతలను ప్రోత్సహించడంలో కేంద్రీకృతమైన, వ్యూహాత్మకమైన జోక్యాల శక్తిని DBRC,టెట్రా ప్యాక్,తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ల మధ్య సహకారం చూపిస్తోంది. ఈ చొరవ కేవలం అట్టడుగు వర్గాల వారిని మద్దతు చేయడమే కాకుండా వ్యర్థాల నిర్వహణ,సామాజిక సంక్షేమాన్ని మెరుగుపరచడానికి అన్వేషించే నగరాల కోసం ఒక అనుకరణ నమూనాగా నిలిచింది.